JAISW News Telugu

Kalki : కల్కి 21 రోజుల్లో అంచనాలను మించి వసూళ్లు

Kalki

Kalki

Kalki Movie : తెలుగు సినిమా రేంజ్‌ ఏటా పెరుగతూ వస్తున్నది. ఒకప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక రాజధాని బెంగళూర్, రాయలసీమ సరిహద్దు ప్రాంతాలు,  తమిళనాడులో ఒకప్పటి మద్రాస్ ప్రస్తుత చెన్నైలోని తెలుగువాళ్లు ఉండే ప్రాంతాల్లో మాత్రమే తెలుగు సినిమాలు ఆడేవి. విదేశాల్లో  నెల, రెండు నెలల తర్వాత పేరున్న హీరోల సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు తెలుగు రాష్ర్టాల కంటే ముందే విదేశాల్లో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా తెలుగు సినిమాలను ఇతర ప్రాంతాల వారు కూడా ఇష్టపడుతున్నారు.

టాలీవుడ్ సినిమాల పరిధిని బాలీవుడ్ అక్కడి నుంచి విదేశాలకు పెంచిన వారిలో  ఈ మధ్య కాలంలో ముందుగా చెప్పుకునేది రాజమౌళి, ప్రభాస్ అనే చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి తెలుగు సినిమా పరిధిని, ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసింది. వీరిద్దరూ వేర్వేరుగా సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నాయి.  హీరోగా సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాలీవుడ్ టాప్ హీరోలకు సాధ్యం కాని రికార్డులను క్రియేట్ చేస్తున్నాడు.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సందడి చేస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.  మూడు వారాలు దాటిని ఈ సినిమా వసూళ్లలో  ఇంకా తన హవాను కొసాగిస్తున్నది.

21 రోజుల్లో కల్కి బిజినెస్  
ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నైజాంలో రూ. 65 కోట్లు, సీడెడ్‌లో రూ. 27 కోట్లు, ఆంధ్రాలో రూ. 76 కోట్లతో కలిపి రెండు తెలుగు రాష్ర్టాల్లో లో రూ. 168 కోట్లు బిజినెస్ చేసింది. కర్నాటక -రూ. 25 కోట్లు, తమిళనాడు-రూ. 16 కోట్లు, రెస్టాఫ్ ఇండియా ప్లస్ హిందీ- రూ. 85 కోట్లు, కేరళ- రూ. 6 కోట్లు, ఓవర్సీస్‌- రూ. 70 కోట్లతో కలిపి మొత్తంగా రూ. 370 కోట్లు బిజినెస్ చేసింది. ‘కల్కి ‘ సినిమాకు 21వ రోజు సెలవు రావడంతో మరింత వసూళ్లు రాబట్టింది.  తెలుగు రాష్ట్రాల్లో రూ. కోటిన్నర వరకూ షేర్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి రూ. 5 కోట్ల దాకా రాబట్టింది. ఇలా మూడు వారాల్లో ఈ చిత్రం రూ. 505 కోట్లకు పైగా షేర్‌ సాధించింది.

Exit mobile version