Kalki 2898 AD : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ‘కల్కి 2898 ఏడీ’ ఒక విభిన్నమైన సినిమా అంటే ఒప్పుకోక తప్పదు. ఎప్పుడో జరిగిన ఇతిహాసాలు భవిష్యత్ ను ముడిపెట్టి చేసిన ఈ మూవీపై ఇప్పటికే ఇండియాతో పాటు ప్రాశ్యాత్య దేశాల్లో కూడా విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. యూ ట్యూబ్ లో ఉన్న ట్రైలర్, టీజర్, సాంగ్ ఇలా ప్రతీ ఒక్క దానికి మిలియన్ల కొద్దీ వ్యూవ్స్ వచ్చాయి.
ఇక ఈ మూవీకి సంబంధించి ఈ రోజు (జూన్ 19) సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ముంబైలో ఈ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. ఎందుకంటే అక్కడైతే హిందీ బెల్ట్ ను టార్గెట్ చేయవచ్చని భావించారు. ఈ ఈవెంట్ కు ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీలతో పాటు నిర్మాతలు అశ్వనీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్, దర్శకుడు నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొంటారు.
ప్రమోషన్ కోసం మొదటి సారిగా నటీనటులంతా కలిసి వస్తుండడంతో ఈ వేడుక అత్యద్భుతంగా ఉండబోతోంది. ఈ వేదిక నుంచే హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. నిన్న (జూన్ 18) రిలీజైన ప్రీ లుక్ బాగుందని, మరికొన్ని థ్రిల్లింగ్ ప్రీలుక్ లు హైప్ కు బూస్ట్ ఇస్తాయని అంటున్నారు. ఇంకా రెండు పాటలు విడుదల కావాల్సి ఉందని, అవి బాగుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్నింటికంటే ముఖ్యమైనది రాబోయే ట్రైలర్.
ఇంకా ఏం చేస్తే సినిమాకు మరింత హైప్ వస్తుంది?
కేవలం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా పవర్ ఫుల్ డైలాగులతో ట్రైలర్ ఇంపాక్టివ్ గా ఉండాలి. కల్కి హిందూ పురాణాల్లో ముఖ్యమైన వ్యక్తి కాబట్టి, ట్రైలర్ హిందూ మతం, భారతీయ పురాణాలను కీర్తించేలా ఉండాలి.
ఇలాంటి ట్రైలర్ అయితే మితవాదుల నుంచి మద్దతు తీసుకుంటుంది. సినిమాను మరింత ప్రోత్సహించి హిందువులు ఎక్కువగా థియేటర్లకు వచ్చేలా చేస్తుంది. ఒక పవర్ ఫుల్ సెకండ్ ట్రైలర్ కీలక హైలైట్స్ ని రివీల్ చేస్తుంది. హిందీ బెల్ట్ లో ఈ చిత్రం స్ట్రాంగ్ ఓపెనింగ్ సాధించేందుకు కూడా సాయపడాలి. ఇవన్నీ చేస్తే హిందీ బెల్ట్ తో పాటు ఇతర భాషల్లో కూడా మంచి హైప్ క్రియేటై సినిమాలకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది.