Kalki 2898 AD : ప్రభాస్ నటించిన యాక్షన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ నిన్న (జూన్ 11) విడుదలై హ్యూజ్ వ్యూవ్స్ దక్కించుకుంది. యూ ట్యూబ్ లో విడుదలైన 24 గంటల్లోనే ఈ ట్రైలర్ ఐదు భాషల్లో 34 మిలియన్ల వ్యూవ్స్ సాధించించింది. ఈ వ్యూవ్స్ సినిమాపై ఉన్న భారీ ఉత్కంఠతకు అద్దం పడుతోంది.
‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ సినిమా జానర్ గురించి, సినిమా నుంచి ఏం ఆశించాలో ప్రజలకు తెలిసేలా తన పని తాను చేసుకుపోయిందని స్పష్టం అవుతోంది.
24 గంటల్లో యూ ట్యూబ్ లో వివిధ భాషల్లో ట్రైలర్ వ్యూవ్స్
– తెలుగు: 14 మిలియన్ వ్యూవ్స్
– తమిళం: 2.3 మిలియన్ వ్యూవ్స్
– కన్నడ: 949 కే వ్యూవ్స్
– మలయాళం: 1 మిలియన్ వ్యూవ్స్
– హిందీ: 16 మిలియన్ వ్యూవ్స్
ట్రైలర్ వ్యూయర్ షిప్ చెప్పుకోదగ్గదే అయినప్పటికీ, ఆల్ టైమ్ మోస్ట్ వ్యూయింగ్ ట్రైలర్స్ లో టాప్ 10లో చోటు దక్కించుకోవడం విశేషం.
యూట్యూబ్ లో 24 గంటల్లో (భాషలకు అతీతంగా) టాప్ ఇండియన్ ట్రైలర్స్
– సలార్: 113.2 M
– కేజీఎఫ్ 2: 106.5 M
– ఆదిపురుష్: 74 M
– సలార్ (సెకండ్ ట్రైలర్): 72.2 M
– యానిమల్: 71.4 M
– డంకీ: 58.5 M
– రాధే శ్యామ్: 57.5 M
– జవాన్ (ప్రేమూ) 55 M
– ఆర్ఆర్ఆర్: 55 M ఆర్ఆర్ఆర్: 51.1 M
24 గంటల వ్యూవ్స్ పరంగా కల్కి 2898 ఏడీని ఇతర తెలుగు ట్రైలర్లతో పోల్చి చూసినా 14 మిలియన్ వ్యూవ్స్ సాధించి టాప్ ప్లేస్ దక్కించుకోలేకపోయింది. గుంటూరు కారం, సలార్, సర్కారు వారి పాట మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. యూ ట్యూబ్ వ్యూవ్స్ బాక్సాఫీస్ విజయాన్ని అంచనా వేయలేవని అందరికీ తెలిసిందే. భారీ వ్యూవ్స్ సాధించిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్ కూడా సాధించలేకపోగా, యావరేజ్ యూ ట్యూబ్ వ్యూవ్స్ ఉన్న కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్నాయి.