JAISW News Telugu

kalki 2898 AD : నీ బ్రెయిన్ అదుర్స్ నాగీ బ్రో.. ఆ లింక్ ఏం కలిపావయ్యా!

Kalki 2898 AD

Kalki 2898 AD

Kalki 2898 AD : కొన్ని రోజులుగా  ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులందరూ కల్కి సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నేడు చాలా గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. దీంతో ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేవు. అందరూ థియేటర్లకు బారులు తీరుతున్నారు. థియేటర్ల దగ్గర పండుగా వాతావరణం నెలకొంది. అయితే కల్కి మొదటి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని కోట్లాదిమంది వేయికళ్లతో ఎదురుచూశారు. వారి అంచనాలకు తగ్గట్టు సినిమా ఉండడంతో ఆనందానికి అవధుల్లేవు.  ఇప్పటికే ఇండియాలో కల్కి మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు పడిపోయాయి. సినిమా బ్లాక్ బస్టర్  హిట్ అంటూ పబ్లిక్ టాక్ బయటకు వచ్చేసింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ,  కమల్‌ హాసన్‌, శోభన కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ సినిమా.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహాభారతంలోని కొన్ని అంశాలను కలియుగానికి లింక్ చేస్తూ.. శ్రీమహావిష్ణువు చివరి అవతారం కల్కి అవతరించే సమయంలో చోటు చేసుకునే పరిణామాలను ఊహిస్తూ  ఈ విజువల్ వండర్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేసింది. తొలి రోజే ఏకంగా రూ.250 కోట్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా. దీంతో బాహుబలి 2 రికార్డులు గల్లంతవ్వడం ఖాయమేనని విశ్లేషకులు చెబుతున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కలిసి నటించారు. హీరోయిన్ దీపికా పదుకొణే, దిశాపటానీ లాంటి వారు కూడా వీరికి జత కలవడంతో హిందీ నాట వసూళ్ల వర్షం కురుస్తుందని ట్రేడ్ వర్గాలు నమ్మకంగా చెబుతున్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ కావడంతో పాటు పిల్లలకు నచ్చే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా బుజ్జి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతుంది.

 మహాభారత యుద్ధంతో కల్కి ప్రారంభం అవుతుంది. ఇందులో అశ్వత్థామ పాత్రను ప్రత్యేకంగా చూపిస్తారు. ఆ యుగం నుంచి కలియుగంలోని 2898 ఏడీకి కథను తీసుకెళతాడు డైరెక్టర్. సినిమా ప్రారంభమైన అరగంటకు ప్రభాస్ ఎంట్రీ ఇస్తాడట. ఈ సీన్‌కు ప్రేక్షకులు కుర్చీలో కూర్చోవడం కష్టమేనని టాక్. అనంతరం విలన్ కమల్ హాసన్ ఎంట్రీ కూడా అదే రేంజ్ లో ఉంటుందట. మొదటి 15 నిమిషాలు మాత్రం అసలు మిస్ కావొద్దని ఫ్యాన్ చెబుతున్నారు. అమితాబ్, ప్రభాస్ చేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ఓ రేంజ్‌లో ఉన్నాయట. ఇంటర్వెల్ బ్యాంగ్.. సెకండ్ పార్ట్‌ డ్రామాను నాగ్ అశ్విన్ అద్భుతంగా డీల్ చేసినట్లుగా ఫ్యాన్స్ చెబుతున్నారు. దీపికా పదుకొణే , దిశాపటానిలు కూడా యాక్షన్ సీన్స్‌ని అదరగొట్టారని టాక్. ఇక క్లైమాక్స్ అయితే గూస్ బంప్సే అని ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది.

Exit mobile version