Kalki 2898 AD : హిస్టరీ క్రియేట్ చేస్తున్న ప్రభాస్.. ఇండియాలోనే ఫస్ట్ సినిమాగా కల్కి రికార్డు
Kalki 2898 AD : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఆయన నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గురించే చర్చ. పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించారు. మరి కొద్ది గంటల్లో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలో ప్రేక్షకులు కొత్త లోకాన్ని చూస్తారని చిత్రబృందం చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త చరిత్ర సృష్టించింది.
‘కల్కి 2898 ఏడీ’ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ‘కల్కి 2898 ఏడీ’ మూవీని పలు భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమాను మే 9వ తేదీనే రిలీజ్ చేద్దామనుకున్నా వీలు కావడంతో 27కు పోస్ట్ పోన్ చేశారు. ఫలితంగా కొద్ది రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇదే సినిమా హడావిడి కనిపిస్తోంది. సినిమా రిలీజ్‌కు టైం దగ్గర పడడంతో అన్ని ఏరియాల్లోనూ టికెట్ల అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన కనబడుతోంది. అందుకే టికెట్లను బుక్ చేసుకునే వెబ్‌సైట్లు అన్నీ క్రాష్ అయిపోతున్నాయి. ఈ సినిమా టికెట్లు భారీగా బుక్ అయిపోతున్నాయి. ఓవర్సీస్‌లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ముందే ఓపెన్ అయ్యాయి. అక్కడ ఈ సినిమాకు దిమ్మతిరిగే రెస్పాన్స్ వస్తోంది. అప్పుడే కలెక్షన్లను కూడా భారీగానే వసూలు చేసింది. ఇలా ఇప్పటికే రూ.30 కోట్లు వరకూ గ్రాస్ వసూళ్లు కూడా వచ్చాయి.
యూఎస్‌లో అడ్వాన్స్ సేల్స్ ఊహించని రీతిలో వస్తున్నాయి. అక్కడ 500 లొకేషన్లలో 3000 షోలకుగానూ ఇప్పటికే 1.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడు పోయాయి. ఇలా ఈ సినిమా యూఎస్‌లో అప్పుడే నాలుగు మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. తద్వారా వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఇండియన్ మూవీగా ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సంచలన రికార్డును నమోదు చేసింది.