Kalki 2898 AD : కల్కి 2898 ఏడీ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్ లో వస్తున్న ఈ మూవీ ఎపిక్ సైన్స్ ఫిక్చన్ తరహాలో నాగ్ అశ్విన్ డైరెక్షన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో కమల్ హసన్, ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, మాళవిక లాంటి తదితరులు కీలక రోల్స్ లో నటిస్తున్నారు. అయితే జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో కథ గురించి రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి.
శ్రీ మహా విష్ణువు అవతారం తర్వాత కల్కి గా అవతరించే కథనే సినిమాగా రూపొందించుకుని నాగ్ అశ్విన్ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మహా భారతంలో అశ్వత్థామ పాత్రను కల్కి లో అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అశ్వత్థామ పాత్ర ఎంత పవర్ ఫుల్ ఉంటుందో భారతం చదివిన అందరికీ తెలిసిందే. అలాంటి కీలక రోల్ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నారు.
ప్రభాస్ బైరవుడిగా కనిపించనున్నాడు. పురాణాల నుంచి ఈ పాత్రను నాగ్ అశ్విన్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. పరమ శివుడు, బ్రహ్మ దేవుడి అయిదు తలలుగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంఘటన ద్వారా బైరవుడు పుడతాడు. బైరవుడు చాలా ధైర్య సాహాసవంతుడు. ఇప్పటి వరకు చూసిన యానిమేషన్, ట్రైలర్ లను చూస్తే బైరవ్ బుజ్జి పాత్ర ఎంటో అర్థమవుతుంది.
అత్యంత పవర్ ఫుల్ క్యారెక్టర్ గా కమల్ హసన్ నటించిన యాస్కిన్ పాత్ర అని తెలుస్తోంది. కమల్ హసన్ గురించి ఓ జర్నలిస్టు డైరెక్టర్ నాగ్ అశ్విన్ అడగ్గా.. ట్రైలర్ మొత్తం కమల్ హసన్ ఉన్నాడని చెప్పాడు. దీంతో కమల్ పాత్రకు కల్కి 2898 ఏడీలో ఎంతటి ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక దీపికా పదుకొణే గర్భిణి పాత్రలో నటిస్తోంది. కల్కి పుట్టబోయేది సినిమాలో దీపికా పదుకొణే కడుపులో అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. మాళవిక పోషిస్తున్న పాత్ర ఉత్తర. మహాభారతంలో అభిమన్యుడి భార్యే ఉత్తర. గర్భవతిగా ఉన్న సమయంలోనే అభిమన్యుడు పద్మవ్యుహంలో చిక్కుకుంటాడు. ఇలా పురాణాలకు సైన్స్ ఫిక్చన్ కు మధ్య చాలా ఆసక్తి రేపుతున్న కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి కథలు, పాత్రలు విశేషాలు వింతలు చూసేందుకు సిద్ధంగా ఉండాల్సిందే.