Kalki 2898 AD : ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘కల్కి 2898 AD’ నేడు థియేటర్లలోకి వచ్చింది. భారీ బడ్జెట్ తో, సెన్సేషనల్ కథలో, భారీ తారాగణంతో చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘కల్కి 2898 AD’ పేరు మారుమోగుతోంది. ఈ సినిమాలో ఔరా అనిపించే అంశాలు బోలెడు ఉన్నాయి. ఈ సినిమాలోని మోస్ట్ ఎక్సయిటింగ్ అంశాలలో ఒకటి ఇండియన్ సినిమాకు చెందిన ఇద్దరు లెజెండ్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ దాదాపు 40ఏళ్ల తర్వాత కలిసి నటించడం. వీరిద్దరూ 1985 కల్ట్ క్లాసిక్ ‘గెరాఫ్తార్’లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బ్రదర్స్ కరణ్, కిషన్ పాత్రలను పోషించారు. 13 సెప్టెంబరు, 1985న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ ఇష్టమైన క్లాసిక్‌గా నిలిచింది.
ఈ సినిమాలో కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ పాత్రను పోషించారు. ఈ క్యారెక్టర్‌లో కమల్ హసన్ లుక్, గెటప్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు, అలాంటి పాత్ర చేయగల ఏకైక నటుడు కమల్ హాసన్ మాత్రమే అనేలా ప్రతి ఒక్కరి నోటా వినబడుతుంది. సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో కమల్ హసన్ మేకోవర్ అన్ బిలివబుల్ అండ్ స్టన్నింగ్‌గా ఉంది. మునుపెన్నడూ చూడని మైండ్ బ్లోయింగ్ అవతార్‌లో కమల్ హాసన్ అద్భుతం చేశారు. ఇందులో అమితాబ్ అశ్వత్థామగా కనిపించారు. ఈ లెజెండరీ యాక్టర్లను ఒకే ఫ్రేమ్‌లో కలిపి ఈ చిత్రం అద్భుతమైన అనుభూతిని కలిగించింది.
కల్కి కథ యూనిక్ గా ఉంటుంది. స్టార్-స్టడెడ్ లైనప్‌తో పాటు అమితాబ్, కమల్ హాసన్ ఆన్-స్క్రీన్ రీయునియన్ చూసే ఛాన్స్ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి 2898 AD ఇండియన్ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించి ఓ సర్‌ప్రైజ్ అప్డేట్ ఇచ్చారు. అదేమంటే.. సినిమా క్లైమాక్స్‌లో ఓ సర్‌ప్రైజ్ సాంగ్ ఉంది. సెకండాఫ్ 80 శాతం యాక్షన్ పార్ట్ తో అలరించింది. ప్రభాస్ పాత్ర సినిమా మొదలైన అరగంట తర్వాత ఎంట్రీ ఇస్తుంది. ఇంతకు ముందెన్నడూ ఉండని బెస్ట్ ఎంట్రీగా ఇందులో ప్రభాస్ ఎంట్రీ ఇస్తారని సినిమా విడుదలకు ముందే నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టా లైవ్‌లో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ‘కల్కి 2898 AD’కి పార్ట్ 2 ఉందని, దీనికి సంబంధించిన వర్క్ 10 రోజులు రిలాక్స్ అయిన తర్వాత మొదలుపెట్టమని నాగ్ అశ్విన్‌ని కోరారు ప్రభాస్. కల్కిలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ నటించటం కూడా సినిమా స్థాయిని మరింత పెంచిందని చెప్పొచ్చు.