Mirzapur 3 : వెబ్ సిరీస్ లలో ఒకదానిని మించి మరొకటి విపరీతంగా ఆకట్టుకున్న వాటిలో ముందుస్థానంలో ఉండేది మీర్జాపూర్ మాత్రమే. యువతకు ఈ సిరీస్ కు బాగా దగ్గరైంది. ఇందులోని డైలాగులు, క్యారెక్టర్లు యూత్ కు బాగా ఎక్కాయి. ఇప్పుడు మూడో సీజన్ కు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు మరింత ఆకట్టుకుంటున్నాయి. ఒక వర్గం ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బోల్డ్ డైలాగ్స్ తో సిరీస్ ప్రాచుర్యం పొందిందని చెప్పొచ్చు. సినిమాలో ఇవే డైలాగ్స్ వాడితే కచ్చితంగా సెన్సార్ బోర్డు కత్తిరించేది. కానీ వెబ్ సిరీస్ కావడంతో దర్శకనిర్మాతలకు స్వేచ్ఛ దొరికింది. ఎడాపెడా బూతులు వాడేశారు.
భాషలతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నది మీర్జాపూర్. క్రైమ్ యాక్షన్ జానర్‌లో రూపొందించిన ఈ సిరీస్ గత రెండు సీజన్లు యువతను అలరించాయి. ఇందులోని పాత్రలపై వచ్చినన్నీ మీమ్స్ మరే వెబ్ సిరీస్ పైనా రాలేదంటే ఆశ్చర్యం కలుకగకమానదు. ఇందులోని నటీనటుల అసలు పేర్లకంటే కూడా ఆ పాత్రల పేర్లతోనే పాపులర్ అవుతున్నారు. కాలీన్‌భయ్యా ( పంకజ్ త్రిపాఠి) గుడ్డు పండిత్ (అలీ ఫజల్) బబ్లూ పండిత్ ( విక్రాంత్ మాస్సే) మున్నా భాయ్ ( దివ్యేందు) గోలు (శ్వేతా త్రిపాఠి) పేర్లతోనే ప్రాచుర్యం పొందారు. ఇక మూడో సీజన్ కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రక్తంతో రాసిన ‘మీర్జాపూర్’.. ఈ కథ ముందుకు సాగాలంటే మళ్లీ రక్తాన్నే కోరుతుంది అంటూ టీజర్ లో చెబుతున్న డైలాగ్స్ బట్టి ఈ సిరీస్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జూలై ఐదో తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ‘ మీర్జాపూర్ సీజన్3’ స్ట్రీమింగ్ కానుంది.
మొదటి సీజన్ లో మాఫియా సామ్రాజ్యం, రెండో సీజన్లో మీర్జాపూర్ ను ఎస్టాబ్లిష్ చేశారు. మీర్జాపూర్ సింహాసనాన్ని దక్కించుకున్న అనంతరం పూర్వాంచల్‌లో ప్రతి దానిని శాసించే శక్తి అవతరించాలనుకుంటాడు గుడ్డు. ఈ క్రమంలో మీర్జాపూర్‌లో కాలిన్ భాయ్ గుర్తులు లేకుండా చెరిపేసే ప్రయత్నాలు చేస్తాడు. మున్నాభాయ్ మరణంతో మాధురీ యాదవ్ రాజకీయాల్లోకి వస్తుంది. కాలిన్ భయ్యాపై సింపతిని క్రియేట్ చేసి, ప్రజలకు దగ్గరవవ్వాలని భావిస్తుంది. కాలిన్ వెనక్కి తిరిగి వస్తాడు. ‘ఈ రాజకీయాలు, వారసత్వం, పూర్వాంచల్‌లో ఏం చేయబోతున్నారో అనేది సీజన్-3లో చూపించబోతున్నట్లు అర్థమవుతున్నది. టీజర్ తో దర్శకులు గుర్మీత్ సింగ్, ఆనంద్ అయ్యర్ మరింత ఆసక్తిని పెంచారు.