JAISW News Telugu

CM Revanth Reddy : కాకా ప్రజల ఆస్తి.. పేదోళ్ల ధైర్యం: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy : కాక వెంకటస్వామి ప్రజల ఆస్తి, పేదోళ్ల ధైర్యం అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతి వేదికగా కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జాతీయస్థాయి నేతల్లో కాకా వెంకట స్వామి ముఖ్యులు అని గుర్తు చేశారు.

తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కాకా జయంతి అధికారికంగా నిర్వహించడం ప్రభుత్వాల బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాకా జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాల్సిన వాళ్లు అసూయతోనో, ద్వేషంతోనో నిర్వహించకుండా వదిలేశారని బీఆర్ఎస్ పై సీఎం మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు కోసమే కాంగ్రెస్ తో టీఆర్ఎస్ కు పొత్తు కుదుర్చారని సీఎం చెప్పారు. ఖర్గే సూచనతోనే కాకా ఫ్యామిలీని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలను కాకా కుటుంబం సద్వినియోగం చేసుకుందని సీఎం తెలిపారు.

Exit mobile version