Kajal Aggarwal : సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ స్టేటస్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కాజల్ అగర్వాల్ పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘లక్ష్మీ కళ్యాణం’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్, ఆ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా ఈమెకి అవకాశాలు వచ్చాయి. ఇది నిజంగా అదృష్టం అనే చెప్పాలి.
ఎందుకంటే మొదటి సినిమా ఫ్లాప్ అయిన హీరోయిన్లు ఇండస్ట్రీ లో కనిపించకుండా పోయారు. కానీ కాజల్ విషయం లో అలా జరగలేదు. మీడియం రేంజ్ హీరోలతో కెరీర్ ప్రారంభం లో నటిస్తూ వచ్చిన ఈ హాట్ బ్యూటీ ‘చందమామ’ చిత్రం తో మొదటి కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ – రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘మగధీర’ చిత్రం ఎంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 హీరోయిన్ గా మారింది. ఇకపోతే రీసెంట్ గానే గౌతమ్ కిచులు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన కాజల్ అగర్వాల్, ఒక బిడ్డకి జన్మనిచ్చింది కూడా. అయితే ప్రస్తుతం తన భర్త, కొడుకు తో కలిసి స్విజర్ల్యాండ్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చెయ్యగా అది ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
ఈ పోస్టులను చూసిన అభిమానులు కొంతమంది మురిసిపోతూ ఉంటే, మరికొంతమంది మాత్రం మండిపడుతున్నారు. కుటుంబం తో ఎంజాయ్ చేసింది చాలు, కాస్త మంచి సినిమాలు, మంచి పాత్రలు చెయ్యి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత నువ్వు చేసిన ‘భగవంత్ కేసరి’ చిత్రం హిట్ అయ్యినప్పటికీ కూడా నీ పాత్ర కి ఏమాత్రం ప్రాధాన్యత లేదు.
నీ తోటి హీరోయిన్లు అయితే కచ్చితంగా ఇలాంటి పాత్రలు చెయ్యడానికి ఒప్పుకోరు, నువ్వెలా ఒప్పుకొని చేసావో అంటూ మండిపడుతున్నారు. కాజల్ అగర్వాల్ ఇప్పటికీ 60 సినిమాలు చేసింది. అభిమానులు కోరుకున్నారనో ఏమో తెలియదు కానీ, ఈమె ప్రధాన పాత్రలో నటించిన ‘సత్యభామ’ చిత్రం అతి త్వరలోనే విడుదల కాబోతుంది. ఇందులో ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించింది. ఈ చిత్రం తో పాటుగా కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ 2’ చిత్రం లో కాజల్ అగర్వాల్ ఒక హీరోయిన్ గా నటించింది.