Kadiyam Srihari Press meet : స్టేషన్ ఘాన్ పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి సమావేశమయ్యారు. పార్టీ మారదామా వద్దా అన్నా అంశంపై ఈ సమావేశం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే కార్యకర్తలకు, నియో జకవర్గ అభివృద్ధి చేసుకొలేమని కడియం అన్నారు.
నేను పార్టీ మారుతున్నానంటే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంత భయమని ఆయన అన్నారు. పసు నూరి దయాకర్, ఆరూరి రమేష్ పార్టీ మారితే లేని అభ్యంతరం నా విషయంలో ఎందుకు అని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.
నా రాజకీయ జీవితంలో నాపై ఒక్క అవినీతి ఆరో పణ కూడా లేదని నాపై ఒక్క పెట్టి కేసు కూడా లేదని ఆయన అన్నారు. ఇప్పుడు నాపై మాట్లా డుతున్న నేతలపై అధికారం పోగానే ఎందుకు డజన్ల కొద్ది కేసులు అవుతున్నాయని ఆయన అన్నారు నాకు 70 ఏళ్లు దాటాయని నా రాజకీయ జీవితం ప్రజాసేవకే అంకితం చేశాను అని కడియం శ్రీహరి అన్నారు.