Kadapa SP : కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు బదిలీ

Kadapa SP
Kadapa SP Transfer : కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. వైసీపీ నేత వర్రా రవీంద్రరెడ్డిపై చర్యలు తీసుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. రవీంద్రరెడ్డి చేసిన అసభ్యకర పోస్టులపై ఫిర్యాదులు వచ్చినా, చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. మరోవైపు కడప జిల్లాలో మరో సీఐని కూడా సస్పెండ్ చేసింది.
రవీంద్రరెడ్డిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పోలీసులపై ఫిర్యాదులు వచ్చాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, అనితపై సోషల్ మీడియాలో రవీంద్రరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.