KA Paul : మంగళగిరి జనసేన కార్యాలయం ఎదుట కేఏ పాల్ హంగామా..
KA Paul : ఏపీ మంగళగిరి జనసేన కార్యా లయం దగ్గర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హల్చల్ చేశారు.. జేనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలవడం కోసం కార్యాలయం కు వచ్చానని కార్యాల సిబ్బందికి తెలియజేశారు. అయితే సిబ్బంది కేఏ పాల్ ను లోపలికి అనుమతించలేదు. దీంతో కేఏ పాల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసే మాస్టర్ ప్లాన్ తన దగ్గర ఉందని ఎలాగైనా పవన్ కళ్యాణ్ కలిసే ఏర్పాటు చేయాలని సిబ్బందిని అడిగారు.
ప్రతి రోజూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాతో టచ్ లో ఉన్నరని పవన్ కళ్యాణ్ సీఎం చేసే ప్లాన్ చెప్పాలని ఒత్తిడి చేయడం వల్ల నేను మీ పార్టీ ఆఫీసుకు వచ్చానని చేసే ప్లాన్ చెబుతానని కేఏ పాల్ సిబ్బం దికి తెలియజేశారు. సిబ్బంది ఎంత చెప్పినా లోప లికి అనుమతించక పోవడంతో ఇవాళ పవన్ కళ్యాణ్ ను కలిసిన తర్వాతనే ఇంటికి వెళ్తానని పవన్ కళ్యాణ్ అర్ధ గంట సేపు నుంచి పార్టీ ఆఫీసు గేటు ముందే బైఠాయించారు. దీంతో సిబ్బంది పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీసులో లేరని చెప్పడంతో కేఏ పాల్ వెనుతిరిగారు.
కే ఏ పాల్ ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్త న చాలా వింతగా ఉంది. కొన్ని మీడియా ఛానల్స్ ఆయనను జోకర్ గా చిత్రీకరిస్తూ కమెడియన్ గా చూపించారు. ఇటీవల ఎవరోనాపై ఫుడ్ పాయి జన్ చేశారని ఇది రాజకీయ కుట్ర అని కేఏ పాల్ ఒక వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని సీఎం చేస్తాను నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందంటూ జనసేన కార్యాలయం ఎదుట నా చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరితే ఒక పార్టీ అధ్యక్షుడు మరొక పార్టీ అధ్యక్షుడిని ఎలా సీఎం చేస్తారని పలువురు చర్చించుకుంటున్నారు.