JAISW News Telugu

Jyothika Suriya : సూర్య తో విడాకుల వ్యవహారం గురించి మొదటిసారి స్పందించిన జ్యోతిక..

Jyothika's first response about Surya's divorce

Jyothika’s first response about Surya’s divorce

Jyothika-Suriya : సౌత్ ఇండియన్ సెలబ్రిటీస్ లో మేడ్ ఫర్ ఈచ్ అథర్ లాగ అనిపించే జంటలలో సూర్య – జ్యోతిక జంట నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. ఇద్దరు కలిసి తమిళం లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అలా నటిస్తున్న సమయం లో వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన ప్రేమ, పెళ్ళికి దారి తీసింది. సూర్య ఇంట్లో తండ్రి శివకుమార్ ఈ పెళ్ళికి ఒప్పుకోకపోయినా కూడా సూర్య తండ్రిని ఒప్పించి ఈ వివాహం చేసుకున్నాడు.

ఈ దంపతులిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చూసేందుకు ఎంతో చక్కగా ఆదర్శ దంపతులు లాగ ఉండే వీళ్లిద్దరి పై గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో విడాకులు తీసుకుంటున్నారు అంటూ ప్రచారం సాగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈమధ్య కాలం లో సెలెబ్రిటీలు విడాకులు ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి, వీళ్లిద్దరు కూడా నిజంగా విడాకులు తీసుకున్నారేమో అని అభిమానులు భయపడ్డారు.

దానికి తోడు జ్యోతిక గత కొంతకాలం నుండి తన పిల్లలతో కలిసి ముంబై లో ఒంటరిగా ఉండడం వంటివి గమనించిన అభిమానులు నిజంగా వీళ్లిద్దరు విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్తను నమ్మారు. అయితే రీసెంట్ గా జ్యోతిక ఒక ప్రముఖ బాలీవుడ్ టీవీ ఛానల్ కి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె విడాకుల గురించి సోషల్ మీడియా లో వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చింది. సూర్య తో పెళ్లి జరిగిన కొన్నాళ్ళకు జ్యోతిక సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమె ఎక్కువగా తమిళం, మలయాళం సినిమాలనే చేస్తూ వచ్చింది. అయితే ఈమధ్యనే ఆమె బాలీవుడ్ లో మూడు సినిమాలకు సంతకం చేసింది. సంవత్సరం వరకు అక్కడే షూటింగ్ ఉంటుంది.

అలాంటి సందర్భం వచ్చినప్పుడు అక్కడ హోటల్స్ లో అన్ని రోజులు నివసించి షూటింగ్స్ చెయ్యడం అసాధ్యం. అందుకే ఆమె ప్రత్యేకంగా ఒక ఇల్లుని తీసుకొని, ఈ సినిమా షూటింగ్స్ పూర్తి చేయబోతుంది.  అందుకోసం మాత్రమే ముంబై కి వచ్చానని, సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె ఈ సందర్భంగా స్పష్టత ఇచ్చింది. ఇకపోతే రీసెంట్ గా మలయాళం స్టార్ హీరో మమ్మూటీ తో కలిసి కాథల్ అనే సినిమా చేసింది. ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి థియేట్రికల్ రన్ వచ్చింది.

Exit mobile version