Justice PC Ghosh : మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లుపై జస్టిస్ పీసీ ఘోష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీకెంట్ ఫైల్స్ విషయంలో ఆయన చెప్పిన సమాధానంపై మండిపడ్డారు. అయోమయంలో విచారణకు వచ్చి, తమను అయోమయంలోకి నెట్టొద్దని హెచ్చరించారు. ప్రత్యేకంగా మేడిగడ్డ ఆనకట్టకు సీకెంట్ ఫైల్స్ వినియోగించమని ఎవరు సూచించారని కమిషన్ చైర్మన్ ప్రశ్నించగా సీడీవో సీఈ సూచనల మేరకు ఇలా చేశానని సమాధానమిచ్చారు.
దీనిపై కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కమిషన్ ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని ఘాటుగా జస్టిస్ ఘోష్ వ్యాఖ్యానించారు. అయితే, తన సమాధానాన్ని సరిచూసుకునే అవకాశం ఇవ్వాలని వెంకటేశ్వర్లు కోరగా, దీనికి అంగీకరించబోనని తేల్చి చెప్పారు. తగిన దస్త్రాలు సమర్పిస్తే సవరించుకునే అవకాశం ఇస్తామని అన్నారు. తనకు ఆంగ్లంపై పూర్తిగా పట్టు లేదని వెంకటేశ్వర్లు తెలుపగా, ఆంగ్లంపై పట్టు లేకుండా కాళేశ్వరం సీఈగా ఎలా పని చేశారని కమిషన్ అసహనం వ్యక్తం చేసింది.