Electricity : విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్ గా జస్టిస్ మదన్ బి. లోకూర్

Electricity

Electricity

Electricity : తెలంగాణలో విద్యుత్ విచారణ కమిషన్ కొత్త ఛైర్మన్ గా జస్టిస్ మదన్ భీంరావు లోకూర్ నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త ఛైర్మన్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇంతకుముందు కమిషన్ చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహరించారు.

ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి, యాదాద్రి, భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రా ఏర్పాటు కోసం తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసి ఛైర్మన్ గా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని నియమించారు. విచారణ జరుగుతున్న సమయంలో కమిషన్ ఏర్పాటు, దాని ఛైర్మన్ నిష్పాక్షికతను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కమిసన్ చైర్మన్ ను మార్చాలని ఆదేశించింది. అదే సమయంలో విచారణ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ ను సైతం కొట్టేయాలన్న కేసీఆర్ వినతిని పరిగణనలోకి తీసుకోలేదు.

ఈ క్రమంలో కమిషన్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తన రాజీనామా లేఖను న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు సమర్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొత్త ఛైర్మన్ ను నియమించింది.

TAGS