JAISW News Telugu

Dunki : ‘డుంకీ’ లాగానే యూఎస్ లో అడుగు పెట్టారు.. కానీ ఇంతలోనే..

Dunki

Dunki

Dunki : ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం ‘డంకీ’ గుర్తుండే ఉంటుంది కదా.. ఇందులో పంజాబ్, గుజరాత్ మరియు హర్యానాకు చెందిన ముగ్గురు యువకులు సైన్యంలో చేరడం లేదా డాక్టర్ కావాలన్న కలలను వదులుకుంటున్నారు. మరింత రిచ్ గా జీవించాలని అమెరికాకు వెళ్లాలనుకుంటారు. కానీ దాని కోసం వారు చట్టవిరుద్ధమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ సినిమా లాగే ఇటీవల ఒక ఘటన జరిగింది.

సరుకు రవాణా రైలులో వచ్చిన కొందరు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారు. అందులో ఇద్దరు ఇండియన్ మెన్.. ఒక ఉమెన్ కలుపుకొని నలుగురు ఉన్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. బఫెలో, న్యూ యార్క్ లో, మార్చి 12న, బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ఇంటర్నేషనల్ రైల్‌రోడ్ వంతెనపై రైలు నుంచి వీరు నలుగురు దూకడం చూశారు. గాయపడిన మహిళను అక్కడే వదిలిన ముగ్గురు పురుషులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు వారిని పట్టుకున్నారు. మహిళ ఎరీ కౌంటీ షెరీఫ్ సహాయకులు మరియు CBP అధికారుల నుంచి ప్రథమ చికిత్స తీసుకుంది. అంబులెన్స్ లో స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

బఫెలో స్టేషన్‌లో, ఏజెంట్లు మహిళ, ఇద్దరు పురుషులు భారతదేశానికి చెందినవారని, మూడో వ్యక్తి డొమినికన్ రిపబ్లిక్‌కు చెందినవారని గుర్తించారు. నలుగురూ దేశంలోకి ప్రవేశించేందుకు ఎలాంటి పత్రాలు లేవు. ఇందులో ముగ్గురు వ్యక్తులు దేశ బహిష్కరణను ఎదుర్కొనబోతున్నారు. మరియు బటావియా ఫెడరల్ డిటెన్షన్ ఫెసిలిటీలో నిర్బంధించబడ్డారు. వారు ఇమ్మిగ్రేషన్ మరియు జాతీయత చట్టం కింద అభియోగాలను ఎదుర్కొంటున్నారు. బఫెలో సెక్టార్ న్యూయార్క్ మరియు పెన్సిల్వేనియా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ మధ్య సరిహద్దు భద్రతను పర్యవేక్షిస్తుంది, 341 మైళ్ల సముద్ర సరిహద్దును కవర్ చేస్తుంది.

Exit mobile version