JAISW News Telugu

Junior NTR : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

Junior NTR

Junior NTR

Junior NTR : టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జూబ్లీ హిల్స్ హౌజింగ్ సొసైటీలోని 681 చదరపు గజాల స్థలం విషయంలో వివాదం నెలకొంది. గీత అనే మహిళ నుంచి ఆయన 2003లో సదరు స్థలాన్ని కొన్నారు. అయితే, ఆ ల్యాండ్ పై బ్యాంకులకు హక్కులు ఉన్నాయంటూ డీఆర్ టీ (రుణ వసూళ్ల ట్రిబ్యునల్) ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని జూ. ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే, ఆ ల్యాండ్ 1996లోనే పలు బ్యాంకుల వద్ద ప్రాపర్టీ మార్టిగేజ్ ద్వారా గీత కుటుంబం అప్పులు పొందింది. ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా ఇదే ల్యాండ్ మీద ఐదు బ్యాంకుల నుంచి గీత లోన్లు తీసుకుంది. కానీ, ల్యాండ్ అమ్మే సమయంలో కేవలం ఒక్క బ్యాంకులోనే లోన్ ఉన్నట్లు తెలిపింది. ఆ సమయంలో చెన్నైలోని ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి ఆ డాక్యుమెంట్స్ ను ఎన్టీఆర్ తీసుకున్నారు. 2003 నుంచి ఆ ప్లాట్ ఓనర్ గా ఆయన ఉన్నారు.

1996లోనే ఈ స్థలాన్ని తనఖా పెట్టి రుణం చెల్లించని కారణంగా ఆ ఆస్తిపై హక్కులు తమవేనని పేర్కొంటూ పలు బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. వాటిని రద్దు చేయాలంటూ తారక్ కోర్టును ఆశ్రయించారు. ల్యాండ్ విషయంలో సమగ్ర విచారణ చేయకుండానే డీఆర్ టీ ఆదేశాలు ఇచ్చిందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించి ఆ స్థలాన్ని అమ్మిన వారిపై కూడా కేసు పెట్టారు. అయితే డాకెట్ ఆదేశాలు అందాల్సి ఉన్నదని, కొంత సమయం ఇస్తే వాటి వివరాలు సమర్పిస్తామని చెప్పారు. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

Exit mobile version