Srivari Laddu controversy : శ్రీవారి లడ్డూ వివాదంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలి : ఏపీ విశ్వహిందూ పరిషత్

Srivari Laddu controversy
Srivari Laddu controversy : తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని ఏపీ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు తనికెళ్ల సత్య హరికుమార్ డిమాండ్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రెండు నెలలు ఏం చేశారో, ప్రభుత్వం ఏ చేసిందో చెప్పాలన్నారు. ధార్మిక అపచారం జరగకుండా చర్యలు తీసుకున్నామని ఆలయ ఈవో గానీ, సీఎం గాని ఇప్పటివరకు చెప్పలేదన్నారు.
ఆహార నాణ్యత విలువలు పాటించకపోతే బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. రాజకీయ కోణంలో చూడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్వామీజీలు, పీఠాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే సంప్రోక్షణ కార్యక్రమం చేపట్టాలని తనికెళ్ల సత్య హరికుమార్ సూచించారు.