Johnny Master : జానీ మాస్టర్ పోలీస్ కస్టడీపై తీర్పు రేపటికి వాయిదా

Johnny Master
Johnny Master Cast Updates : జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. 5 రోజుల కస్టడీ కోసం నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై కూడా బుధవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి. ప్రస్తుతం జానీ మాస్టర్ చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
సహాయ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ఈ నెల 19న అతన్ని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఉప్పరపల్లి కోర్టులో ఆయనను హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం జానీ మాస్టర్ హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉండగా ఆయనను వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.