JAISW News Telugu

Hyderabad News : జూబ్లిహిల్స్ హనీట్రాప్..  ఈ కీ‘లేడి’ వలవేస్తే ఎంతటి మొనగాడైన విలవిలే!

Jubilee Hills Honeytrap..

Jubilee Hills Honeytrap..

Hyderabad News : రాష్ట్రంలో హనీట్రాప్ లు పెరిగిపోతున్నాయి. వార్తల్లోకి వచ్చేవి కొన్నైతే.. మనకు తెలియనివి ఎన్నో. ఇటీవల కాలంలో కొందరు కీలాడీ మహిళల కీచక పర్వాలు సర్వసాధారణమైపోయాయి. వలపు వల విసిరేసి అమాయకులతో డబ్బులు లాగడం, అవసరమైతే అంతమొందించడం.. ఇలాంటి వారికి కామన్  అయిపోయింది. డబ్బుల కోసం ఎంతకైనా తెగించి కటకటాలపాలవుతున్నారు.  నిత్యం ఎక్కడో చోట హనీట్రాప్ సంఘటనలు జరుగడం.. అందులో అమాయకులు బలైపోవడం పరిపాటిగా మారింది. తాజాగా జూబ్లిహిల్స్ హనీట్రాప్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

రియల్ ఎస్టేట్ వ్యాపారి పుట్ట రాము అలియాస్ సింగోటం రామన్న(36) హత్య కేసులో నిందితురాలిగా ఉన్న ఇమామ్ బీ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆమెపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో ఐదు ఎఫ్ఐఆర్ లు నమోదైనట్లు గుర్తించారు.

2017, 2018లో ఇద్దరు వేర్వేరు అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్న ఇమామ్ బీ ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 2020లోనూ జూబ్లిహిల్స్ వెంకటగిరిలో వ్యభిచారం నడిపిస్తోందని అదుపులోకి తీసుకున్నారు. 2017లో మేడిపల్లికి చెందిన విష్ణుకాంత్ అనే వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి రూ.3 లక్షలు నగదు కాజేసినట్టు కేసు నమోదైంది. 2019లో తన కుమార్తెను రాజు అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడంటూ తప్పుడు ఫిర్యాదు చేసినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇలా ఇమామ్ బీ పలువురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు.

సింగోటం రామన్న కేసు ఇది..
హైదరాబాద్ యూసుఫ్ గూడలో సింగోటం రామన్న హత్య సంచలనం రేకెత్తించింది. ఆయన్ను పదిమంది అతికిరాతకంగా కత్తులతో పొడిచి చంపేశారు. అయితే మొదటగా ఈ కేసు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కారణమని భావించారు. అయితే దీని వెనుక హనీట్రాప్ ఉందని తెలిసింది. సింగోటం రామన్న హత్య వెనుక ఇమామ్ బీ, ఆమె కూతురు నసీమా ఉన్నారని పోలీసులు తేల్చారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారి సింగోటం రామన్నపై ఇమామ్ బీ తన కూతురిని గా వలస వేసింది.  రామును లొంగదీసుకున్న ఇమామ్ బీ అతడి వద్ద భారీ మొత్తంలో డబ్బులు కొట్టేసింది. తల్లీకూతుళ్ల వలకు చిక్కిన రాము లక్షలాది రూపాయలు ఇచ్చి మోసపోయాడు. ఈ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు  అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది ఇమామ్ బీ.  తన చేతికి మట్టి అంటకుండా రామన్న పై పగతో ఉన్న మణికంఠకు ఈ విషయాన్ని తెలిపింది. రామన్నను చంపేందుకు అతడు కూడా ఒప్పుకున్నాడు. తన కూతురు నసీమాతో ఫోన్ చేయించి రామన్నను ఇంటికి పిలిపించుకుంది. అదును చేసి మణికంఠకు ఫోన్ చేసింది. అక్కడే అతడిని దారుణంగా హత్య చేశారు. మర్మాంగాలను సైతం పాశవికంగా కోసి, సుమారు 50 కత్తిపోట్లకు పాల్పడ్డారు.

Exit mobile version