Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ మాట ఇచ్చి పైసా ఇవ్వలేదు : క్యాన్సర్ అభిమాని తల్లి
Jr. NTR : దేవర సినిమా విడుదల సందర్భంగా క్యాన్సర్ పేషెంట్.. వీరాభిమాని అయిన కౌశిక్‌కి సహాయం చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కౌశిక్ తల్లి సరస్వతి మీడియాతో తాజాగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తమకు ఎలాంటి సాయం చేయలేదన్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న తన కొడుకు కౌశిక్‌కు సాయం చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారని సరస్వతి అన్నారు. దేవర సినిమా విడుదలకు ముందు జూనియర్ ఎన్టీఆర్ తనతో, తన కొడుకుతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి చికిత్సకు డబ్బులు ఇస్తానని చెప్పారని సరస్వతి తెలిపారు.
ప్రస్తుతం చెన్నైలో అపోలో కౌశిక్ చికిత్స పూర్తయిందని, ప్రభుత్వం రూ.11 లక్షలు, టీటీడీకి రూ.40 లక్షల సాయం అందిందని సరస్వతి తెలిపారు. ఇంకా ఆసుపత్రికి 20 లక్షలు కట్టాల్సి ఉందని…. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మరోసారి ఎన్టీఆర్ పై ఈ అభాండాలు పడి ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారు.. మాకు పైసా కూడా ఇవ్వలేదు: అభిమాని తల్లి pic.twitter.com/LCpho6mVjk
— DJ MANI VELALA (@MaNi_ChiNna_) December 23, 2024