తెలుగు సినిమాల్లో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ కొన్నేళ్లుగా సహోద్యోగిని లైంగికంగా వేధించిన కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నారు. అతని గ్రూప్ లో ఉన్న యువతి తక్కువ సమయంలోనే అసిస్టెంట్ గా మారింది. ఆ సమయంలో ఆమె మైనర్ తనపై మాస్టర్ అప్పటి నుంచే వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఇటీవల కేసు పెట్టింది.
అయితే, తాను బాధితురాలుకాదని, నేను బాధితుడినని జానీ మాస్టర్ చెప్తున్నారు. తను మేజర్ అయినప్పటి నుంచి తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తుందని విచారణలో జానీ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. అయితే తనకు వివాహం జరిగిపోయిందని ఇది కుదరదని చెప్పడంతో ఇలా తనపై అక్రమ కేసులు పెట్టిందని చెప్పాడు. ఏదేమైనా కేసు దర్యాప్తు దశలో ఉంది కాబట్టి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదని, పూర్తయిన తర్వాత నిజా నిజాలు బయటకు వస్తాయని అంతా అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీ మాత్రం ఇప్పుడు ఈ విషయంలో తీవ్ర విచారణలో ఉందనే చెప్పాలి.