JAISW News Telugu

Joe Biden : బైడెన్ వింత ప్రవర్తన.. అందరూ ఒక దిక్కయితే.. ఆయన మరోదిక్కు..

Joe Biden

Joe Biden

Joe Biden : ఇటలీలో అమెరికా దేశాధ్యక్షుడు చేసిన పనికి మిగతా దేశాధినేతలు బిత్తర పోయారు. ఏంటి ఈయన ఇలా చేస్తున్నారంటూ పెదవి విచిరారు. దేశమే గొప్పది కానీ అధ్యక్షుడి వాలకం ఇంత వింతగా ఉందని నోరెళ్లబెట్టారు. అసలు విషయానికి వస్తే ఇటలీ వేదికగా G7 దేశాల సదస్సు జరిగింది. G7లో సభ్యత్వం లేకున్నా ప్రధాని మోడీని పెద్దన్న పాత్ర పోషించాల్సింది ఆయా దేశాలు కోరడంతో మోడీ కూడా వెళ్లారు. మోడీ 3.O తర్వాత ఇదే మొదటి పర్యటన.

అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, జపాన్, ఇటలీ, బ్రిటన్.. మాత్రమే G7లో ఉన్నాయి. స్పెషల్ గెస్ట్ గా భారత్ తరఫు నుంచి మోడీ పాల్గొనబోతోన్నారు. ఇందుకు మరో ఆహ్వానితుడు ఉక్రెయిన్ అధ్యక్షులు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కూడా ఉన్నారు. పరిమితంగా దేశాల అధ్యక్షులు ఉన్నారు.

ఇటలీ తీర నగరం అపూలియాలో 2 రోజుల పాటు భేటీ కొనసాగనుంది. ఇందులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయెల్ మాక్రాన్, బ్రిటన్, కెనడా పీఎంలు రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్ పాల్గొననున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ G7కు అధ్యక్షత వహించనుంది.

ఈ సదస్సులో ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను కట్టడి చేయడం, ఆ దేశం ఆక్రమణలో ఉన్న ప్రాంతాలకు విముక్తి కల్పించడం చర్చకు రానున్నాయి. ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వంపై కూడా చర్చకు రానుంది. G7 దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.

సదస్సు మొదలు కాక ముందు అపూలియా ప్రాంతాన్ని అధ్యక్షులు, ప్రధానులు  సందర్శించారు. వాటర్ స్పోర్ట్స్‌ వీక్షించారు. ఆ సమయంలో జో బైడెన్ ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రిషి సునాక్, మెలోనీ, జస్టిన్ ట్రూడో, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్‌ తిలకిస్తోండగా.. జో బైడెన్ వారికి దూరంగా వెళ్లి నిల్చున్నారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఉన్నట్టు అటు వైపుగా వెళ్తూ కనిపించాడు. కుడి చేయి పైకెత్తి వారిని పలకరించడం కనిపించింది.

దీన్ని గమనించిన మెలోనీ.. బైడెన్ వద్దకు వెళ్లి ఆయన చేయి పట్టుకొని వెనక్కి తీసుకువచ్చారు. దీంతో బైడెన్ తేరుకొని, మళ్లీ వారితో కలిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైడెన్ చేతిలో ఉన్న అమెరికాను దేవుడే కాపాడాలంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version