Joe Biden : జో బైడెన్.. ఈసారి ‘వైస్ ప్రెసిడెంట్’

Joe Biden

Joe Biden

Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అయోమయానికి లోనయ్యారు. కరోనా కాలంలోని పరిస్థితులను ప్రస్తావిస్తూ ఆ టైంలో తాను ఉపాధ్యక్షుడిగా పనిచేశానని అన్నారు. బైడెన్ ఇటీవల మాటలపై నియంత్రణ కోల్పోయిన సందర్భాలు అనేకం కనిపిస్తున్నాయి. తాజాగా ఆయన మరోసారి గందరగోళానికి గురయ్యారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన కరోనా కష్ట కాలం గురించి ప్రస్తావిస్తూ ఆ సమయంలో తాను దేశ ఉపాధ్యక్షుడిగా పని చేసినట్లు తెలిపారు. వాస్తవానికి ఆ సమయంలో రిపబ్లికన్ పార్టీ నేత మైక్ పెన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

‘‘కరోనా సమయంలో ప్రపంచం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ పరిస్థితులు ఎంతో చెడ్డవి. నాడు నేను ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్నా. అధ్యక్షుడు బరాక్ ఒబామా.. డెట్రాయిట్ వెళ్లి అక్కడి సమస్యలను పరిష్కరించాలంటూ నన్ను ఆదేశించారు’’ అని బైడెన్ వ్యాఖ్యానించారు. అయితే, ఆ సమయంలో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్.. మైక్ పెన్స్ ఉపాధ్యక్షుడిగా ఉండగా.. ఈ విషయాన్ని మరచిపోయిన బైడెన్ తానే ఆ పదవిలె ఉన్నట్లు చెప్పుకోవడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది. దీంతో ఆయన మరోసారి విమర్శలను ఎదుర్కొంటున్నారు.

TAGS