Joe Biden : జో బైడెన్ మరోసారి తడబాటు.. బ్యాలెట్ బాక్సు బదులు బ్యాటిల్ బాక్సు అంటూ వ్యాఖ్యలు 

Joe Biden

Joe Biden

Joe Biden : అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ లో జరగనుండగా.. ఇప్పటికే డెమొక్రాట్లు, రిపబ్లికన్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో హడావిగా ఉంటున్నారు. అయితే ఫెన్సిల్వేనియాలో అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పోటీదారుపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో త్రుటిలో తప్పించుకున్న ట్రంప్ ప్రాణాలతో బయటపడ్డాడు.

అయితే ఎన్నికల ప్రచారంలో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ పొరబాబు పడుతూనే ఉన్నారు. తప్పులు మాట్లాడుతూ.. పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేస్తున్నారు. నాటో దేశాల కూటమి సదస్సులో మాట్లాడుతూ.. మీరు తప్పుకుంటే కమలా హ్యరిస్ ను అధ్యక్షురాలిగా గెలిపించేందుకు డెమొక్రాట్లు ఒప్పుకుంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా ట్రంపునకు అర్హత లేకుంటే నేను ఆమెను వైస్ ప్రెసిడెంట్ చేసే వాడని కాదన్నారు. అయితే కమలా హ్యరిస్ బదులు ట్రంపు అని పలకడంతో అందరూ ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు.

కూటమి సభ్యులకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడిని జెలెన్ స్కీ అని పరిచయం చేయబోయి.. పుతిన్ అని పేరు చెప్పడంతో అందరూ నిర్ఘాంతపోయారు. ఎన్నికల ప్రసంగంలో మాట్లాడుతూ.. ఎవరూ విజేతగా నిలుస్తారో బ్యాలెట్ బాక్సులు తేలుస్తాయి అనబోయి.. బ్యాటిల్ బాక్సులు అని అన్నారు. దీంతో సభలో అందరూ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. అయితే బైడెన్ వయసు రీత్యా చాల పెద్ద వాడు కావడంతో ఆయనకు మతిమరుపు ఉందని ఇప్పటికే ట్రంపు విమర్శలు చేశారు.

ట్రంప్ వైపే అమెరికా ఓటర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ట్రంపు పై కాల్పుల ఘటన తర్వాత ఆయన ఇమేజ్ 70 శాతం వరకు పెరిగిపోయిందని గెలుపు లాంఛనమే అని అంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ సారి బైడెన్ ట్రంపునకు పెద్దగా పోటీ ఇవ్వకపోవచ్చని అనుకుంటున్నారు. ఒక వేళ ఇచ్చిన కేవలం అంతరం తగ్గించడమే అని చెబుతున్నారు. ట్రంపు గెలుపు పక్కన బెడితే బైడెన్ తప్పుడు స్పీచ్ లతో డెమొక్రాట్లు తలలు పట్టుకుంటున్నారు.

TAGS