Indian American Shakuntla l Bhaya : భారత సంతతి మహిళకు బైడెన్ ప్రభుత్వం మరో కీలక పదవి
Indian American Shakuntla l Bhaya : ప్రపంచంలో ఏ దేశానికి లేని గౌరవం ఎప్పుడూ భారత్ కు ఉండనే ఉంటుంది. భారతదేశం, భారత సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచలోని వివిధ దేశాల్లో దేశాధ్యక్షులుగా, ప్రధానులుగా కొనసాగుతున్నారు. యునైటెడ్ కింగ్ డమ్ కు అధ్యక్షుడిగా రిషి సునాక్ కొనసాగుతుండగా.. సాంకేతిక ప్రపంచానికి గొప్పవైన గూగుల్, మైక్రోసాఫ్ట్ లను నిర్వహిస్తున్నది కూడా భారతీయులే. ఇది నిజంగా ప్రతీ భారతీయుడికి గౌరవమే.
అమెరికాలో భారత సంతతికి చెందిన కమలా దేవి హ్యారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు. ఈ తరుణంలో బైడెన్ ప్రభుత్వం ఇండో అమెరికన్ కు కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం వైట్ హౌజ్ గురువారం (నవంబర్ 16)న అధికారికంగా ప్రకటించింది. అమెరికా అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ సభ్యురాలిగా ఇండో అమెరికన్ శకుంతల ఎల్ భయ్యాకు బాధ్యతలు అప్పగించింది బైడెన్ ప్రభుత్వం.
శకుంతల ప్రస్తుతం డెలావేర్ న్యాయ సంస్థ సహ యజమానిగా కొనసాగుతున్నారు. ఏడేళ్ల నుంచి ఆమె డెలావేర్ రాష్టానికి గవర్నర్ జాన్ కార్నేయ్ జ్యుడీషియల్ నామినేటింగ్ కమిషన్ సభ్యురాలిగా కూడా పని చేశారు. న్యాయవాద వృత్తితోపాటు డెలావేర్ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం డెలావేర్ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
గతంలో అమెరికన్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ అండ్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ సభ్యురాలిగా చేశారు. ఎల్జీబీటీక్యూ+కమ్యూనిటీ హక్కుల పరిరక్షణ, వారి పిల్లల దత్తత, పని ప్రదేశాలలో వివక్షను రూపుమాపేందుకు ఆమె పని చేశారు. డెలావేర్ బార్ అసోసియేషన్ లో చోటు దక్కించుకున్న తొలి దక్షిణాసియా భారత మహిళగా చరిత్ర సృష్టించారు. నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ లాలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే వివిధ సేవా, రాజకీయ కార్యక్రమాల్లో పని చేస్తున్నారు.