Collector Muzimil Khan : ఖమ్మం మార్కెట్ లో పత్తి ధరల పతనంపై కలెక్టర్ ముజిమిల్ ఖాన్ స్పందించారు. మంగళవారం కలెక్టర్ వ్యవసాయ మార్కెట్ కు వెళ్లగా.. వ్యాపారులు ఇష్టానుసారం పత్తి కొనుగోలు చేస్తున్నారనం రైతులు ఫిర్యాదు చేశారు. గిట్టుబాటు ధర రావడం లేదని వాపోయారు. దీంతో అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యోగాలు ఊడుతాయని మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిని హెచ్చరించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో పత్తి ధరలు మళ్లీ పడిపోయాయి. క్వింటాల్ రూ.6,100కు పడిపోయింది. వ్యవసాయ మార్కెట్ కు దాదాపు 20 వేల బస్తాల పత్తి వచ్చింది. పత్తి ధరలు పడిపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే భారీగా ధరలు పడిపోయాయని రైతులు పేర్కొంటున్నారు.