DGP : తెలంగాణ రాష్ట్ర డీజీపీగా డాక్టర్ జితేంద్ర ను నియమిస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. పంజాబ్ లోని జలంధర్ లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జితేంద్ర ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. నక్సలైట్ల కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నసమయంలో మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా కీలకపాత్ర పోషించారు. జితేందర్ 2004 నుంచి 2006 వరకు ఢిల్లీ సీబీఐ, గ్రేహౌండ్స్ మతో కలిసి పనిచేశారు. తరువాత ఆయన డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ (డీఐజీ)గా పదోన్నతి పొందారు. ఆ సమయంలో విశాఖపట్నంలో బాధ్యతలు చేపట్టారు.
ఏపీలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ టో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనర్ గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన 2025 సెప్గెంబరులో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన ఈ పదవిలో దాదాపు 14 నెలల పాటు కొనసాగే అవకాశముంది.
ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఎన్నికల కమిషన్ నియమించింది. అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీకుమార్ ను క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేసిన తర్వాత రవిగుప్తాను ఎంపిక చేసింది. అప్పటి నుంచి ఆయనే డీజీపీగా ఉన్నారు.