Medigadda : మేడిగడ్డ ఎగువన జియోట్యూబ్ కట్ట..

Medigadda

Medigadda

Medigadda : మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన గోదావరి వరదను మళ్లించడానికి జియో ట్యూబ్‌ సాంకేతికతతో నిర్మించ తలపెట్టిన కట్టపై చీఫ్‌ ఇంజనీర్ల(బీవోసీఈ) బోర్డు సమావేశం శుక్రవారం నిర్వహించింది. నీటిపారుదలశాఖలోని బీవోసీఈ హాలులో జరిగిన ఈ సమావేశంలో ఈ టెక్నాలజీపై చర్చించారు. ఈ సందర్భంగా వీరేంద్ర టెక్స్‌టైల్‌ అనే సంస్థ జియో ట్యూబ్‌ సాంకేతికతపై పవర్‌ పాయింట్‌ ప్రెజంటేషన్‌ ద్వారా వివరించింది. దేశంలో తొలిసారిగా 2010లో బ్రహ్మపుత్ర బేసిన్‌లో వరదల నుంచి రక్షణ కోసం 5 కిలోమీటర్ల వరకు కరకట్టలుగా జియో ట్యూబ్‌లను వినియోగించినట్లు తెలిపింది.

5 కిలోమీటర్ల దాకా దాదాపు 6 లక్షల జనాభాకు వరద నుంచి రక్షణ అందించడంలో జియోట్యూబ్ పాత్ర కీలకంగా ఉందని వారు వివరించారు. అసోంలోని కొప్పిలి, సెస్సా, సింగ్రి, రాఫ్తి, ఖో, ఘాగ్రా వంటి నదుల వరద నుంచి రక్షణ కోసం ఈ సాంకేతికతని వినియోగించినట్లు గుర్తుచేశారు. తాత్కాలిక కట్ట కోసం జియో ట్యూబ్‌లను తరలించడం.. నింపడం చాలా తేలిక అని నివేదించారు. ట్యూబ్‌లు దెబ్బతిన్నా వాటిని మరమ్మతు చేయడానికి వీలుంటుందని తెలిపారు.

TAGS