Jhanvi Emotional : జాన్వీ ఎమోషనల్ టచ్ @ తిరుమల ఆలయం

Jhanvi Emotional
Jhanvi Emotional : శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ చాలా సార్లు తిరుమలలో కనిపించడం మనం చూస్తేనే ఉన్నాం. బలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతో మంది తారలు ఉన్నా.. జాన్వీ కపూర్ మాత్రం దాదాపు మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి తిరుమలలో కనిపిస్తుంటుంది. అసలు ఆమె అక్కడికి ఎందుకు అన్ని సార్లు వస్తుందని చాలా మంది ప్రశ్నించారు. దానికి ఆమె చాలా సార్లు సమాధానం దాటేసింది. దాని వెనుక అసలు వేరే కథ ఉందని తెలుస్తోంది.
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు సాధారణంగా కొందరు ప్రముఖులు, రాజకీయ నాయకులు వస్తుంటారు. తిరుమలను విపరీతంగా సందర్శించే నటి ఎవరైనా ఉన్నారంటే అది జాన్వీ కపూర్ మాత్రమే అని బల్ల గుద్ది మరీ చెప్పవచ్చు. కేవలం భక్తి కోసమే జాన్వీ తిరుమలకు రావడం లేదని, దీని వెనుక చాలా ఎమోషనల్ రీజన్ ఉందని తెలుస్తోంది. ఒక సందర్భంలో ఆమె మాట్లాడుతూ..
‘మా అమ్మ (శ్రీదేవి) ప్రతి ఏటా తిరుమల శ్రీవారిని దర్శించుకునేది. ఆమె చనిపోయిన తర్వాత నాకు వీలైనంత తరచుగా గుడికి వెళ్లడం అలవాటు చేసుకున్నాను. మా అమ్మ చనిపోయిన తర్వాత తొలిసారి తిరుమలకు వెళ్లినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాను. తిరుమలకు వెళ్లిన ప్రతిసారీ నాకు ఓదార్పు దొరుకుతుంది, అందుకే ఈ ప్రదేశాన్ని తరచూ సందర్శిస్తుంటాను.’ అని చెప్పింది. దీంతో పాటు తిరుమలతో జాన్వీకి విడదీయలేని భావోద్వేగ అనుబంధం ఉందని, ఆమె తరచూ ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం గురించి ఆసక్తిగా ఉన్న చాలా మంది ప్రశ్నలకు ఇది సమాధానం చెప్పాలి.
శ్రీదేవి కూడా దాదాపు సంవత్సరంలో చాలా సార్లు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేది. స్వామి వారికి ఆమె అతిపెద్ద భక్తురాలు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో ‘దేవర’, రామ్ చరణ్ తో ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.