JAISW News Telugu

Jethwani case : ముంబై నటి జెత్వానీ కేసు.. వైసీపీ నేత విద్యాసాగర్ రిమాండ్ పొడిగింపు

Jethwani case : ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో నిందితుడు, వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రిమాండ్ పొడిగించారు. విజయవాడ నాలుగో ఏసీఎంఎం కోర్టు ఈ నెల 29 వరకు రిమాండ్ ను పొడిగించింది. ఈ కేసులో ఆయనను ఏ1గా చేర్చారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా విద్యాసాగర్ ఉన్నారు.

ఈ కేసులో నిందితులుగా పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఏ2గా పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ3గా కాంతి రాణా, ఏ4గా వెస్ట్ జోన్ ఏసీపీగా పనిచేసిన హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్ గున్నీ పేర్లను చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ముగ్గురు ఐపీఎస్ లు, ఏసీపీ, సీఐను సస్పెండ్ చేసింది.

Exit mobile version