Jeevan Reddy : కాంగ్రెస్ పార్టీ నిజామాబాదు అభ్యర్థిగా టి జీవన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన బుధవారం నామినేషన్ వేసిన సందర్బంగ ఆయనకు ఉన్న ఆస్తులు,అప్పులు, పోలీస్ కేసుల వివరాలతో పాటు ఆయన కుటుంబ సభ్యల పేరుమీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాలతోపాటు అఫిడవిట్ లో పొందుపరిచారు. మొత్తం ఆస్తులలు 3.55 కోట్లు ఉన్నట్టు ప్రకటించారు.జగిత్యాలలో ఒక సొంత ఇల్లు,ఒక ఇన్నోవా క్రిష్టా కారు ఉంది. 35.24 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది.68.38 లక్షల విలువ గల చార ఆస్తులు ఉన్నవి.భార్యకు 50 తులాల బంగారు నగలు ఉన్నవి. బ్యాంకు లో 58.14 లక్షల ఋణం ఉంది. నాలుగు పోలీస్ కేసులు ఉన్నవి.
1981 లో రాజకీయ ప్రవేశం చేసిన జీవన్ రెడ్డి తొలిసారి స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 1983 లో ఎమ్మెల్యేగా జగిత్యాల నుంచి ఎన్నికయ్యారు. మంత్రివర్గంలోకి ఎన్టీఆర్ తీసుకున్నారు. ఆయనతో విభేదించి కాంగ్రెస్లో 1984 లో చేరారు. 1989 నుంచి 2014 వరకు వరుసగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా జగిత్యాల నుంచి గెలుపొందారు. 2019 లో ఎమ్మెల్సీ గ ఎన్నికయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి గెలవడంతో ఉత్తర తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఒకే ఒక్క సీట్ నమోదు కావడం విశేషం. కరీంనగర్ లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 2006, 2008 లో కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు.
నిజామాబాదు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి విజయం సాధిస్తాడని,కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను.జీవన్ రెడ్డి కేంద్రంలో మంత్రి కాగానే నిజామాబాదు ప్రజల అభివృద్ధి కి అవసరమైన పసుపు బోర్డు తీసుకు వచ్చే భాద్యత అప్పుడు జీవం రెడ్డి తీసుకుంటారు. అదేవిదంగా జీవన్ రెడ్దని గెలిపిస్తే మూతపడిన బోధన్ చక్కెర ఫ్యాక్టరీని కూడా తిరిగి ప్రారంభిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 15 తేదీ లోగ బోధన్ ఫ్యాక్టరీని ప్రారంభించే విదంగా చర్యలు తీసుకుంటానని సీఎం ఇచ్చిన హామీ జీవన్ రెడ్డి గెలుపుకు ఎంత మేరకు ఉపయోగపడుతాయో వేచి చూడాల్సిందే.