Jeevan Reddy:నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆట మొద మొదలైందని, కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వాన్ని దీవించకుండా.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానని మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పేర్కొనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తమకు తెలుసు అని చురకలు అటించారు.
తెలంగాణ సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాసంక్షేమమే ముఖ్యమని, మద్యం దుకాణాలను తొలగొంచి విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు. 60 వేల కోట్లు ఉన్న అప్పులను 6 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సమాజాన్ని మద్యానికి బానిసలుగా చేశారని చెప్పారు. 8 వేల కోట్లు ఉన్న మద్యం ఆదాయాన్ని 40 వేల కోట్లకు తీసుకెళ్లారని వెల్లడించారు. ఆయన జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.