
JD Vance Family
JD Vance : అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తొలిసారిగా భారత్ పర్యటనకు వచ్చారు. ఆయన కుటుంబం దిల్లీకి వచ్చిన వేళ, వారి వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాన్స్ కుమారులు కుర్తా-పైజామాలో, కుమార్తె లాంగ్ గౌనులో దర్శనమిచ్చారు. సంప్రదాయ భారతీయ దుస్తుల్లో వారి రూపం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ నాలుగు రోజుల పర్యటనలో వాన్స్ ప్రధాని మోదీతో భేటీ అయ్యి కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారు. జయపుర్, ఆగ్రా వంటి చారిత్రక ప్రదేశాలు సందర్శించనున్న వాన్స్ కుటుంబ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక మైలురాయిగా భావిస్తున్నారు.