JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డికి అస్వస్థత – ఆస్పత్రిలో చికిత్స

JC Prabhakar Reddy
JC Prabhakar Reddy : టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న తాడిపత్రిలో ఉద్రిక్తతల క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ గ్యాస్ ప్రభావంతో ఆయన లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైదరాబాద్ లోని కాంచన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిన్న (మంగళవారం) తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం రాళ్ల దాడికి దిగారు. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ వారు రాళ్ల దాడి చేయడాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటివైపు వేలాది మంది టీడీపీ కార్యకర్తలతో బయలుదేరిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ జేసీ ముందుకు సాగడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.