JAISW News Telugu

Jaya Jayahe Telangana : ‘జయ జయహే తెలంగాణ’ మ్యూజిక్ కంపోజింగ్ పై దుమారం..

Jaya Jayahe Telangana

Jaya Jayahe Telangana

Jaya Jayahe Telangana : రాష్ట్ర పగ్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తర్వాత చాలా మార్పులు తీసుకువస్తుంది.  అందెశ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర గీతంగా ప్రకటించాలని నిర్ణయించింది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పాట కంపోజిషన్ బాధ్యతలను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణికి సీఎం అప్పగించారు. కొద్ది రోజుల క్రితం కీరవాణి, అందెశ్రీ స్వయంగా రేవంత్ రెడ్డిని కలిసి పాట కూర్పుపై చర్చించారు.

కాగా, ఈ పాటను కీరవాణి కంపోజ్ చేయడంపై తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ (టీసీఎంఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో ఎంతో మంది ప్రతిభావంతులైన సంగీత విద్వాంసులు ఉన్నప్పుడు పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం సరికాదని వారు రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్దకాలంగా ఈ చారిత్రాత్మక గీతాన్ని విస్మరించిందని లేఖలో పేర్కొన్నారు. అయితే, దీన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించాలని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని టీసీఎంఏ అభినందించింది, కానీ కంపోజ్ చేసే బాధ్యతను కీరవాణికి ఇవ్వడం ‘చారిత్రాత్మక తప్పిదం’ అని నొక్కి చెప్పింది.

తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో ముందుండాలనే ఆశ, ఆకాంక్షతో రాష్ట్రం సాధించుకున్నామని, కానీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేసే బాధ్యతలు పొరుగు రాష్ట్రం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడంపై కొన్ని వర్గాలు గుర్రుగా ఉన్నాయి.  రాష్ట్ర ప్రజలకు అవకాశం ఇవ్వాలనే నినాదంతో రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు కీరవాణికి ఈ అవకాశం ఇస్తే అది చారిత్రాత్మక తప్పిదం అవుతుంది అని లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ లేఖపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కళకు హద్దులు లేవని, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతీ తెలుగు కళాకారుడిని గౌరవించారని వారు నమ్ముతారు. కళలో ఈ ప్రాంతీయ సెంటిమెంటు అంశాన్ని లేవనెత్తడం విడ్డూరంగా ఉందని వారు వాదిస్తున్నారు.

కళారంగంలో ప్రాంతీయ అలజడులను తిరిగి ప్రవేశపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా ఈ లేఖ ఉండవచ్చని మరికొందరు భావిస్తున్నారు. తమ హయాంలో రాష్ట్ర గీతంగా ప్రకటించని జయ జయహే తెలంగాణను కాంగ్రెస్ ప్రవేశ పెట్టి మార్కులు కొట్టేస్తుందనే ఇలా చేశారా? అంటూ వాదనలు వినిపిస్తున్నాయి. 

Exit mobile version