JAISW News Telugu

January Review : జనవరిలో ఏ మూవీ బాక్సాఫీస్ సాధించింది

January Box office Review

January Box office Review

January Review : తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి ప్రధానమైనది. అందుకే సంక్రాంతికి ముందు సినిమాలు.. సంక్రాంతికి తర్వాత సినిమాలు అంటూ చెప్పుకోవాలి. ఏటా సంక్రాంతికి భారీ సినిమాలే విడుదలవుతాయి. అందులో ఒకే సినిమా డామినేషన్ చేస్తుంటుంది. ఈ ఏడాది జనవరిలో కూడా అదే రిపీట్ అయింది. సంక్రాంతికి ముందు బాక్సాఫీస్ డల్ గానే కనిపిస్తుంది. ఈ జనవరిలో కూడా ఫస్ట్ వీక్ అదే జరిగింది. సర్కారు నౌకరి, ప్రేమకథ లాంటి చిన్న సినిమాలుమాత్రమే వచ్చాయి.

కానీ అవేవి బాక్సాఫీస్ దరిదాపులకు కూడా రాలేకపోయాయి. కానీ ఇందులో ‘సర్కారు నౌకరి’ గురించి మాట్లాడుకుంటే సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా నటించాడు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మించగా.. కంటెంట్ కొంత మేరకే ఒకే అయినా.. రాంగ్ టైమ్ రిలీజ్ తో దెబ్బ కొట్టింది.

తర్వాతి వారం బాక్సాఫీస్ మొత్తం స్తబ్ధుగా ఉంది. ఎందుకంటే, సంక్రాంతి సినిమాల కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి. ఈ సారి టాలీవుడ్ వివాదాలు కొంచెం ప్రేక్షకుల దృష్టిని పక్కకు తీసుకెళ్లాయి. ఇలా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గుంటూరు కారం, హను-మాన్ సంక్రాంతి బాక్సాఫీస్ గ్రాండ్ గా ఓపెన్ అయ్యాయి.

అయితే, మహేశ్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించారు. ఒక దశలో హను-మాన్ కు అగ్రిమెంట్లు చేసుకున్న థియేటర్లు కూడా గుంటూరు కారం వైపు వెళ్లిపోయాయి. అలా అతి భారీగా రిలీజైన గుంటూరు కారం ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో లేదంటూ హీరో ఫ్యాన్స్ నుంచి పెదవి విరుపులు మొదలయ్యాయి. అదే టైములో హను-మాన్ అద్భుతంగా ఉందనే టాక్ బయటకొచ్చింది.

ఇలా ఒక భారీ మూవీకి మిక్స్ డ్ టాక్.. చిన్న మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడం జరిగిపోయింది. భారీ రిలీజ్, స్టార్ పవర్ కారణంగా, సినిమా బాగాలేదంటూనే జనం గుంటూరు కారం చూశారు. అలా కొంత మేరకు వసూళ్లను రాబట్టింది. త్రివిక్రమ్ లాంటి దర్శకుడిలో ఉండాల్సిన కంటెంట్ కాదని. దీనికి తోడు ఫ్యామిలీ సినిమాను పక్కా మాస్ గా ప్రొజెక్ట్ చేయడం పెద్ద మైనస్ గా మారింది.

అదే టైమ్ లో హను-మాన్ మూవీపై కంప్లయింట్ లేదు. తక్కువ అంచనాలతో సినిమాకు వచ్చిన ప్రేక్షకులు కొన్ని సన్నివేశాలకు ఫిదా అయ్యారు. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా విషయంలో బ్లాక్ బస్టర్ అనే పదం చాలా చిన్నది. సంక్రాంతి సినిమాల బాక్సాఫీస్ గురించి మాట్లాడితే హను-మాన్ తక్కువ బడ్జెట్ తో వచ్చిన భారీ కలెక్షన్లను దక్కించుకుంది.

గుంటూరు కారం, హను-మాన్ వచ్చిన 24 గంటలకే విక్టరీ వెంకటేశ్ సైంధవ్ రిలీజైంది. వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మితిమీరిన హింస ఈ మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరం చేసింది.

ఇక, ఈ వరుసలో చివరలో ఉన్నది ‘నా సామిరంగ’. కేవలం సంక్రాంతిని కోసమే రికార్డ్ టైమ్ లో సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేశారు. రొటీన్ సీన్లు, డైలాగ్స్ మూవీలో జీవం లేకుండా చేశాయి. కీరవాణి మ్యూజిక్ మరో మైనస్. సంక్రాంతికి కాకుండా మరో టైమ్ లో వచ్చి ఉంటే కచ్చితంగా ఫ్లాప్ అయ్యేది.

కెప్టెన్ మిల్లర్ రిపబ్లిక్ డేకు రిలీజైంది. మంచి వీకెండ్ లో వచ్చినా బాక్సాఫీస్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. ధనుష్ నటించిన ఈ మూవీ తెలుగులో డిజాస్టర్ గా మిగిలింది. ఈ మూవీతో పాటు హన్సిక నటించిన 105వ సినిమా కూడా ఫ్లాప్ అయింది. మరో 3 సినిమాలు ఇదే దారి పట్టాయి. ఓవరాల్ గా జనవరిలో హను-మాన్ తిరుగులేని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.

Exit mobile version