Anant Ambani Wedding : అనంత్ ప్రీ వెడ్డింగ్ జోష్ ధోని దంపతులతో జాన్వీ కపూర్.. ఫొటోలు వైరల్..

Anant Ambani Wedding

Anant Ambani Wedding

Anant Ambani Wedding : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట అనంత్ రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలు మూడు రోజుల నుంచి వైభవంగా కొనసాగుతున్నాయి. రాధిక మర్చంట్ ప్రముఖ పారిశ్రామిక వేత్త వీరేన్ మర్చంట్-శైల మర్చంట్ కూతురు. ఈ ఏడాది జులై 12వ తేదీ వివాహం జరగనుండడంతో ఇందులో భాగంగా కొన్ని నెలల ముందు నుంచే వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సంవత్సరంలో అత్యంత చర్చనీయాంశంగా ఈ వివాహం ఉండబోతోంది. ఈ పెళ్లికి ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు రానున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్ లో మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు 3 రోజులు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ వైభవంగా జరిగాయి. అంబానీ కుటుంబానికి జామ్‌నగర్ తో భావోద్వేగ అనుబంధం ఉంది. మూడు రోజుల వేడుక సందర్భంగా.. జామ్‌నగర్ విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం సొబగులను సంతరించుకుంది. విదేశాల నుంచి అతిథులు తరలివచ్చారు. మూడు రోజుల్లో పదుల సంఖ్యలో స్పెషల్ ఫ్లైట్లు ఇక్కడకు వచ్చాయి.

అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఇండియాలోనే కాక.. అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. వరల్డ్ పాప్ స్టార్ రిహానా ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో తన ప్రోగ్రాం ఇచ్చింది. రెండో రోజు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అలియా భట్, జాన్వీ కపూర్‌తో సహా బాలీవుడ్ తారలు కనిపించారు. క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ కూడా ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యాడు. పబ్లిక్ ఫంక్షన్లలో అరుదుగా కనిపించే ధోని తన భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి పెళ్లి వేడుకకు రావడం ప్రత్యేకతను సంతరించుకుంది. అరుదుగా కనిపించే వీరితో జాన్వీ కపూర్ ఫొటో దిగడం.. దాన్ని తన ఇన్ స్టాలో షేర్ చేయడం జరిగింది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

TAGS