Janhvi Kapoor : పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన జాన్వీ

Janhvi Kapoor

Janhvi Kapoor

Janhvi Kapoor : తన వివాహానికి సంబంధించిన ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఖండించారు. ‘‘జాన్వీకపూర్ పెళ్లి తిరుపతిలో జరుగుతుంది. బంగారు రంగు శారీ కట్టుకోనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు’’ అని ఇన్ స్టాలో ఓ నెటిజన్ పెట్టాడు. దానికి జాన్వీకపూర్ రియాక్టయ్యారు. ‘ఏదైనా రాస్తారా’ అని రిప్లై ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ కు అభిమానులు కూడా సరదాగా కామెంట్లు పెడుతున్నారు. ‘మీకు కూడా తెలియకుండా మీ పెళ్లి చేసేస్తున్నారు’ అని ఒకరు పోస్ట్ పెట్టగా.. ‘మీరు పెళ్లి చేసుకునే వరకు వీళ్లు ప్రశాంతంగా ఉండేలా లేరు’ అని మరొకరు కామెంట్ చేశారు.

కొంతకాలంగా జాన్వీకపూర్ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మహారాష్ట్ల మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడే శిఖర్ తో జాన్వీ డేటింగ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ లోకి ‘దేవర’ సినిమాతో జాన్వీ ఎంట్రీ ఇస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. దీనితో పాటు రాంచరణ్ – బుచ్చిబాబుల కాంబోలో రానున్న సినిమాలోనూ జాన్వీకపూర్ నటిస్తున్నారు.

TAGS