Pawan Kalyan : పేర్ని నానికి జన సేనాని పవన్ హెచ్చరిక

Pawan Kalyan
Pawan Kalyan : బుధవారం బందర్ లో నిర్వహించిన సభలో మాజీ మంత్రి పేర్ని నానిపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కులం పేరుతో ఇష్టానుసారం మాట్లాడితే జాగ్రత్త.. ఒళ్లు దగ్గర పెట్టేకొని మాట్లాడు అని హెచ్చరించారు.
బందర్ సభలో పవన్ కళ్యాణ్ మాటలపై ఓ వీడియో మీడియాలో వైరలవుతోంది. అందులో ‘మేము మేము కాపులం అంటూ ఇష్టానుసారంగా బూతులు తిడతావా..? ఎండుకు ఈ బలుపు..? జగన్ కు ఊడిగం చేసి కుక్క పిల్లలా ఉండాలంటే ఉండొచ్చు. అంతేకానీ కులం పేరుతో ఇష్టానుసారం మాట్లాడితే జాగ్రత్త. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎక్కువ మాట్లాడకు. మర్యాద ఇచ్చినపు్పడు నిలబెట్టుకో.. పిచ్చి వాగుడు బంద్ చేయ్’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.