
Mudragada
Mudragada : తనను పవన్, జనసేన అభిమానులు బూతులతో ఇబ్బంది పెడుతున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో ఇటువంటి దాడులు చేయడం నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. ప్రతిపక్షాలపై దాడులు జరగకుండా పవన్ కళ్యాణ్ టీడీపీకి సూచించాలని కోరారు.
‘ఇలా చేయడం కంటే మిమ్మల్ని చంపించండి. మేం అనాథలం. కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని. చేతగానోడిని, కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు పవన్ చేతిలో ఉన్నాయి కాబట్టి, కాపులకు రిజర్వేషన్లు ఇప్పించాలి. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుపైనా ఆయన ఆలోచించాలి’ అని ముద్రగడ సూచించారు.