Minister Narayana : మంత్రి నారాయణను కలిసిన జైస్వరాజ్య డిజిటల్ హెడ్ రాకేష్

Jaiswaraajya.tv Digital Head Rakesh who met Minister Narayana
Minister Narayana : ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువదీరింది. నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల సారథ్యంలో మంత్రివర్గ కూర్పు రూపొందింది. కొత్త మంత్రులందరూ తాజాగా మంచిరోజు చూసుకొని బాధ్యతలు స్వీకరించారు.
ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సైతం తన పురపాలక శాఖ కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ను జైస్వరాజ్య టీవీ డిజిటల్ హెడ్ రాకేష్ గారితోపాటు టీం కలిసి అభినందనలు తెలియజేశారు
జైస్వరాజ్య టీవీ డిజిటల్ హెడ్ రాకేష్ గారితో మంత్రి నారాయణ ఈ సందర్భంగా ముచ్చటించారు. జైస్వరాజ్య టీవీ చానెల్ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు.. డా.జై యలమంచిలి గారు యూబ్లడ్ ద్వారా చేసిన సేవలను మంత్రికి రాకేష్ గారు వివరించారు.
అంతేగాకుండా జైస్వరాజ్య టీవీకి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే రాజధాని అభివృద్ధి, అన్నా క్యాంటీన్లు, ఆగిపోయిన మంత్రుల భవనాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్జీ ల క్వార్టర్స్ గురించి జైస్వరాజ్య టీవీ రూపొందంచిన వరుస కథనాలను మంత్రిగారికి చూపించారు. వీటి ఆవశ్యకతను వివరించారు. దీనికి స్పందించిన మంత్రి నారాయణ పెండింగ్ భవనాలు, అమరావతి పనులు అన్నీ త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
రెండు రోజుల క్రితం జైస్వరాజ్య టీవీ అమరావతిలో ఆగిపోయిన భవనాల స్టోరీలు సంచలనమైన సంగతి తెలిసిందే.. వాటిని మంత్రికి చూపించగా అద్భుతంగా ప్రజల కోణాన్ని ఆవిష్కరించారని మంత్రి ఈ సందర్భంగా రాకేష్ గారితోపాటు జైస్వరాజ్య టీంను అభినందించారు. వాటిని త్వరలోనే ప్రారంభమవుతాయని.. త్వరలోనే ఈ పనులన్నింటిని ముగిస్తామని జైస్వరాజ్య టీంకు చెప్పారు.