JAISW News Telugu

Jailer 2 : ‘జైలర్ 2’ వచ్చేస్తుంది..ఈసారి ఆ హీరో కూడా ఉండబోతున్నాడా!

'Jailor 2' is coming very soon rajinikanth

‘Jailor 2’ is coming very soon hero rajinikanth

Jailer 2 : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘జైలర్’ గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీని సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. కెరీర్ లో వరుస ఫ్లాప్స్ తో డీలాపడిన రజినీకాంత్ ఫ్యాన్స్ కి ఈ సినిమా ఇచ్చిన ఊపు మామూలుది కాదు. మన తెలుగు లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి గబ్బర్ సింగ్ చిత్రం ఎలాంటి అనుభూతి ఇచ్చిందో, అలాంటి అనుభూతి ‘జైలర్’ చిత్రం రజినీకాంత్ ఫ్యాన్స్ కి ఇచ్చింది.

సుమారుగా 650 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాని ఢీ కొట్టడానికి చాలా సినిమాలు ప్రయత్నం చేసాయి. ఉదాహరణకి తమిళ హీరో విజయ్ మరియు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘లియో’ చిత్రం ‘జైలర్’ వసూళ్లను దాటేస్తుందని అనుకున్నారు, కానీ అది జరగలేదు,  620 కోట్ల రూపాయిల గ్రాస్ వద్ద రన్ ముగిసింది.

అలాగే రీసెంట్ గా విడుదలైన ‘సలార్’ చిత్రం కూడా ‘జైలర్’ వసూళ్లను అందుకోలేకపోయింది. కేవలం 600 కోట్ల రూపాయిల వద్ద దాని వసూళ్లు క్లోజ్ అయ్యాయి. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, జైలర్ సినిమా సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో అని. అలాంటి భారీ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ రాకపోతే అసలు బాగుంటుందా?, ఉండదు కదా..!, అందుకే ఈ సినిమాకి సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నట్టు ఆ చిత్ర దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ నేడు ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. సీక్వెల్ కి కావాల్సిన కరెక్ట్ పాయింట్ దొరికిందని, రజినీకాంత్ గారికి కూడా ఆ పాయింట్ తెగ నచ్చేసిందని త్వరలోనే జైలర్ 2 మీరంతా చూడొచ్చు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రజినీకాంత్ జై భీం డైరెక్టర్ జ్ఞానవేల్ రాజా తో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా పూర్తి అయిన వెంటనే లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చెయ్యడానికి సిద్దమయ్యాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాతే జైలర్ సినిమా సీక్వెల్ మన ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఒక తమిళ యంగ్ హీరో కూడా ముఖ్య పాత్ర చేయబోతున్నాడట. ఒక మంచి ముహూర్తం చూసుకొని ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియచెయ్యబోతున్నాడట డైరెక్టర్ నెల్సన్. అభిమానులు ఆ అధికారిక ప్రకటన కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది లోనే షూటింగ్ పూజా కార్యక్రమాలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Exit mobile version