Jai Swaraajya TV Poll : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నెల వరకు మాత్రమే వ్యవధి ఉందని తెలుస్తోంది. దాదాపు ఏప్రిల్ లో షెడ్యూల్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు బలా బలాల గురించి సర్వే సంస్థలు, టీవీలు, యూట్యూబ్, వెచ్ ఛానళ్లు సర్వేలు చేస్తున్నాయి. సర్వేలో కొన్ని అంశాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీని పక్కకు నెట్టిన ఏపీ ప్రజలు వైసీపీని పీఠం ఎక్కించారు. పాలనా పగ్గాలు అందుకున్న జగన్ ఏపీని పరుగులు పెట్టించారు. ఆయన నిర్ణయాలతో ఏపీ వెన్నులో వణుకుపుట్టిందంటే అతిశయోక్తి కాదు. ఇటు మూడు రాజధానులు.. అటు చంద్రబాబును అరెస్ట్ చేయించడం ఇలా చాలానే ఉన్నాయనుకోండి.
తన ఐదేళ్ల పాలన తర్వాత 2024లో మరోసారి ప్రజల ముందుకు వస్తున్నాడు జగన్. అయితే, ఈ సారి పవనాలు ఎటువైపునకు వీస్తాయన్నది సర్వత్రా చర్చ జరుగుతోంది. జగన్ పాలనను ప్రజలు మెచ్చుకుంటారా? లేదంటే తిరస్కరిస్తారా? అన్న అనుమానం చాలా మందికి కలుగుతుంది. ఈ నేపథ్యంలో జైస్వరాజ్య టీవీ పోల్ ను నిర్వహించింది. ఈ పోల్ లో ఆసక్తికర ఫలితాలు వెలుగు చూశాయి.
‘వీరిలో మీ మద్దతు ఎవరికి’ అంటూ జై స్వరాజ్య టీవీ ఒక పోల్ కండక్ట్ చేసింది. ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పోటీలో నిలిపింది. ఈ పోల్ లో రెండున్నర లక్షలకు పైగా మంది పాల్గొనగా వారందరూ టీడీపీ వైపు మొగ్గు చూపారు. మరోసారి చంద్రబాబును సీఎంగా చూడాలని అనుకుంటున్నారు.
ఈ ఓట్లలో 29 శాతం జగన్ కు మద్దతిస్తే.. పవన్ కళ్యాణ్ కు 19 శాతం, షర్మిలకు 5 శాతం మంది మద్దతిచ్చారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మాత్రం 48 శాతం మంది మద్దతిస్తున్నట్లు ఓటు వేశారు.