POK-Jai Hindustan : పీవోకేలో ‘‘జై హిందుస్థాన్’’ నినాదం.. అఖండ భారత్ సాధ్యం కాబోతుందా?

POK

POK – Jai Hindustan Slogan

POK – Jai Hindustan Slogan : అఖండ భారత్ సాధ్యం కాబోతుందా.. కోట్లాది ప్రజల ఆకాంక్షలు నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయా..అంటే అవుననే చెప్పవచ్చు. 1947లో భారత పాలకుల నిర్లక్ష్యం వల్ల జమ్మూ కశ్మీర్ లోని ఉత్తర భాగాన్ని పాకిస్తాన్ సైన్యం అక్రమించింది. అప్పటి నుంచి ఆ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ గా పిలువబడుతోంది. అక్కడి జనాభాలో దాదాపు ముస్లింలే. పాక్ అక్కడి నుంచి ఉగ్రవాదులను తయారు చేసి ప్రస్తుత కశ్మీర్ లో అరాచకం సృష్టించేది. అయితే కాలక్రమేణా అక్కడి ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తోంది.

ఇప్పుడు అక్కడి ప్రజలు  భారతదేశంలో కలుస్తామని నినదిస్తున్నారు. పాకిస్తాన్ సర్కార్ కు వ్యతిరేకంగా భారీగా ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. తమ ప్రాంత వనరులను దోపిడీ చేస్తూ పంజాబ్, సింధ్ ప్రావిన్స్ లను అభివృద్ధి చేస్తున్నారంటూ   పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే), గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఆందోళనకు దిగారు.   లక్షలాది మంది జనం రోడ్లపైకి వచ్చి పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు.

ఆ ప్రజాందోళనకు సంబంధించిన వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా గోధుమల కొరతతో జనం అల్లాడిపోతున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో కిలో గోధుమ పిండి ధర రూ. 150 వరకు ఉంటే   గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో రూ. 200 వరకు ఉంటోంది. దీంతో పాక్ ప్రభుత్వం తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని పీఓకే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను భారత్ తో కలపాలని, కార్గిల్ రోడ్ ఓపెన్ చేయాలని లక్షల మంది   ర్యాలీలు చేశారు. గత 12 రోజులుగా ఈ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి.

మరోవైపు భారత్ ఎప్పుడైనా పీఓకే, గిల్గిత్ బాల్టిస్తాన్ పై దాడి చేస్తుందన్న అనుమానం పాకిస్థాన్ లో ఉంది. దీంతో గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో పాక్ సైనిక కార్యకలాపాలను పెంచుతోంది. దీంతో అక్కడి స్థానికులను వేరే ప్రాంతానికి తరలిస్తోంది. దీంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుతున్నాయి. గిల్గిట్ – బాల్టిస్తాన్‌లకు స్వాధీనం చేసుకుంటామని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన సంగతి విదితమే.  ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల వేళ పలువురు బీజేపీ నేతలు పీవోకేను స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు.

కాగా, గతంలో భారత్ లో చేరబోమంటూ  ఉద్యమాలు  చేసిన వారే ఇప్పుడు ఇండియాకు అనుకూలంగా ఉద్యమిస్తుండటం గమనార్హం.  భారత్ నుంచి విడిపోయిన దేశాలన్నీ మళ్లీ విలీనం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో అక్కడి ఉద్యమ నేతలు భారత్ లో చేరుతామని, భారత్ సైన్యానికి సహకరిస్తామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం విశేషం. అలాగే జైహింద్, జై హిందుస్థాన్ నినాదాలతో పీవోకే ప్రాంతం మారుమోగిపోతోంది. పాక్  రోజురోజుకూ పతనస్థితిలోకి పడిపోవడం, అదే సమయంలో భారత్ అభివృద్ధిపథంలో దూసుకెళ్తుండడంతో పీవోకే ప్రజలు భారత్ లో చేరాలని కోరుకుంటున్నారు. సమీప భవిష్యత్ లో అఖండ భారత్ సాధ్యమయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.

TAGS