Jai Balaiah : తెలుగు సినిమా ఖ్యాతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా బాలయ్య బాబుకు నాలుగో జనరేషన్ పిల్లలు అభిమానులుగా ఉండడం విశేషం. తాజాగా అబుదాబి వేదికగా ఐఫా అవార్డుల కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈవెంట్స్ జరుగుతున్నాయి.
ఇంతలో ఉన్నట్లుండి పిల్లలు ‘‘జై బాలయ్య’’ అని అరవడం ప్రారంభించారు. పిల్లలు పెద్దపెట్టున జై బాలయ్య నినాదాలు చేయడంతో వేదికపై నున్న సింగర్ బాలయ్య బాబుకు సంబంధించిన సినిమా పాట పాడాల్సి వచ్చింది. ప్రస్తుతం నెట్టింట్లో దీనికి సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి.
బాలయ్య బాబుకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అందులో పిల్లలు 10 ఏళ్ల లోపువారు ఉన్నారంటే అతిశయోక్తి కాదని ఈ సంఘటన రుజువు చేసింది. పెద్దా చిన్న తేడా లేకుండా ఎందరో అభిమానులు ఉన్న బాలయ్యకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కేవలం నందమూరి అభిమానులే కాదు, మూవీ లవర్స్ లో చాలా మంది జై బాలయ్య అనే పదం వినిపించగానే ఎగ్జయిట్ అవుతుంటారు. బాలయ్య ఫీవర్ ఖండాంతరాలను దాటిందనడానికి అబుదాబిలో పిల్లల నినాదాలే నిదర్శనం.