Jahnavi Death : జాహ్నవి మృతి.. ఊడిన అమెరికా పోలీసు అధికారి ఉద్యోగం

Jahnavi Death

Jahnavi Death

Jahnavi Death : అమెరికాలో జాహ్నవి కందుల మృతి చెందిన సమయంలో డేనియల్ అడెరెర్ అనే పోలీసు అధికారిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఆయన మాటలు మనసును గాయపర్చేలా ఉన్నాయని సియాటెల్ పోలీసు డిపార్ట్ మెంట్ చీఫ్ సూ రహర్ పేర్కొన్నారు.

ఏపీ కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి (23) 2023 జనవరిలో సియాటెల్ లోని పోలీసే పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతి చెందింది. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్ అడెరెర్ చులకనగా మాట్లాడుతూ నవ్విన వీడియో ఒకటి అప్పట్లో వైరలయింది. ఆమె సాధారణ వ్యక్తి, ఈ మరణానికి విలువలేదు అన్నట్లుగా ఆయన మాట్లాడాడం తీవ్ర దుమారం రేపింది. ఆ అధికారిపూ చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం కూడా డిమాండ్ చేసింది. దీంతో అతన్ని అప్పట్లో సస్పెండ్ చేశారు. తాజాగా అతన్ని ఉద్యోగంలోంచి తీసివేశారు.

TAGS