Social Media : వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జిగా జగన్ బంధువు..ఈయన ఎవరంటే..

Social Media

Social Media

YCP Social Media : ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 175 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ ఘోర పరాజయం తర్వాత వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. వైసీపీకి మాజీ మంత్రులు ఆళ్ల నాని, శిద్ధా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, మద్దాలి గిరి, కిలారి రోశయ్య రాజీనామా చేశారు. అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు నరసింహయ్య కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

ఈ పరిణామాలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా తన పార్టీపై దృష్టి సారించారు. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత వారం వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తాడేపల్లిలోని జగన్‌ నివాసానికి తరలించారు. అయితే తాజాగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ  సోషల్ మీడియా ఇంచార్జిని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారని.. ఆ స్థానంలో కొత్త వ్యక్తిని నియమించారని.. ఈ మేరకు సోషల్ మీడియాలో సమాచారం.

వైఎస్ విజయమ్మ తమ్ముడు సుదర్శన్‌ రెడ్డి అల్లుడు యశ్వంత్ రెడ్డిని సోషల్ మీడియా ఇంచార్జిగా నియమించారని తెలుస్తోంది.  ప్రస్తుత ఇంచార్జి సజ్జల భార్గవ పర్యవేక్షణలో యశ్వంత్ రెడ్డి పని చేస్తారని సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి మరింత బలంగా తీసుకెళ్లేలా సోషల్ మీడియాను వైసీపీ బలోపేతం చేసుకుంటోందని తెలుస్తోంది.

మరోవైపు వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా ఇంచార్జ్‌గా అశోక్‌రెడ్డిని నియమిస్తే.. ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జల భార్గవరెడ్డి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా ఇన్ ఛార్జిగా ఆయన కొనసాగుతున్న  సంగతి తెలిసిందే.. ఈ కీలక విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద పార్టీ బలోపేతానికి, సోషల్ మీడియాలో దూకుడు పెంచేందుకు వైసీపీ అధిష్టానం కొత్త ఇంచార్జిని నియమించినట్లు చర్చ జరుగుతోంది. త్వరలో మరికొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని చర్చ జరుగుతోంది. అలాగే జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవులను కూడా త్వరలో భర్తీ చేస్తారని భావిస్తున్నారు.

TAGS