CM Jagan : ఏపీ సీఎం జగన్ ఎవరి మాట వినరు అని అంటారు. చివరకు ఆధ్యాత్మిక వేత్తల మాట కూడా పట్టించుకోరని కూడా తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా జగన్ స్వామి స్వరూపానంద కోరికను మన్నించలేకపోయారు. ఆయనపై కోపం వచ్చిందా లేకపోతే.. అధికారులు ఇరుక్కుపోతామని భయపడ్డారా ఏమో తెలియదు కానీ.. స్వరూపానంద కోరికను మాత్రం తీర్చలేకపోయారు.
అసలు విషయం ఏంటంటే.. భీమిలి సమీపంలో ఏకంగా 15 ఎకరాలు శారదా పీఠానికి ప్రభుత్వం రాసిచ్చింది. ఆ భూములను ఆధ్యాత్మిక ప్రచారానికి మాత్రమే వాడుకోవాలని సూచించింది. అయితే శారదా పీఠం స్వరూపానంద.. తాము చాలా చోట్ల ఆధ్యాత్మిక ప్రచారం చేస్తున్నామని.. భీమిలి భూముల్లో మాత్రం వ్యాపారం చేస్తామని దరఖాస్తు పెట్టింది. ఈ దరఖాస్తు కాస్త విచిత్రంగా ఉండడంతో అధికారులు అటూ ఇటూ ఊగిసలాడారు.
ఎన్నికల కోడ్ వచ్చే వరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. కోడ్ వచ్చిన తర్వాత తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇచ్చిన భూమిని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే వాడుకోవాలని స్పష్టం చేశారు. అయితే అసలు ఆ భూమి ఆధ్యాత్మిక ప్రచారానికి అవసరం లేదని.. చాలా చోట్ల చేస్తున్నామని చెప్పారు కాబట్టి.. ఆ భూకేటాయింపును రద్దు చేయాల్సి ఉన్నా ఆ పని చేయలేదు.